పాకిస్థాన్ క్రికెటర్లపై మరోసారి వారి సొంత క్రికెట్ అభిమానులే మండిపడుతున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి.. న్యూజిలాండ్‌కు 15 ఓవర్లలో 138 పరుగుల టార్గెట్ ఇచ్చి బాబర్ అజమ్ విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఆ టార్గెట్‌ను ఛాలెంజ్‌గా తీసుకున్న న్యూజిలాండ్ టీ20 స్టైల్లో బ్యాటింగ్ చేసి.. మ్యాచ్ గెలిచేలా కనిపించింది. కానీ.. అప్పటికే లైట్ ఫెయిల్ అయిందని మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేయడంతో పాక్ ఓటమి నుంచి తప్పించుకుంది. పాకిస్థాన్ చూపించిన అతి విశ్వాసంతో పాక్ క్రికెట్ అభిమానులకే మండిపోయింది. అప్పటికే ఆస్ట్రేలియాపై సిరీస్ ఓటమి, ఇంగ్లండ్‌తో వైట్‌వాష్‌తో బాధపడుతుంటే.. ఇలా చేతులారా మ్యాచ్ సమర్పించుకునే నిర్ణయాలు అవసరమా అంటూ.. పాక్ కెప్టెన్ బాబర్‌పై విమర్శలు గుప్పించారు.
తాజాగా.. సోమవారం మొదలైన రెండో టెస్టులో మరోసారి పాక్ క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు పాక్ క్రికెటర్లు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. పాక్ బౌలింగ్ ఎటాక్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. మంచి స్కోర్ దిశగా సాగుతోంది. కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్ 71, డెవాన్ కావ్వె 122 తొలి వికెట్‌కు 134లు జోడించి.. మంచి ఆరంభాన్ని అందించారు. 71 పరుగులు చేసి లాథమ్ అవుటైనా.. కాన్వె, కేన్ విలియమ్సన్తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. గత మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన కేన్ మామ.. అదే ఉత్సాహంతో క్రీజ్‌లోకి వచ్చాడు. వీరిద్దరి జోడీ కూడా భారీ భాగస్వామ్యం దిశగా దూసుకెళ్తోంది. న్యూజిలాండ్ స్కోర్ అప్పటికే 200 మార్క్ దాటేసింది. ఈ క్రమంలో.. నసీమ్ షా వేసిన ఇన్నింగ్స్ 60వ ఓవర్లో పాకిస్థాన్‌కు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది.
33 పరుగుల వద్ద ఉన్న సమయంలో కేన్ విలియమ్సన్ నసీమ్ వేసిన ఆఫ్సైడ్బంతి ఆడే ప్రయత్నం చేశాడు కేన్ మామ అది ఎడ్జ్ తీసుకుంటూ.. వెళ్లి కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ చేతుల్లో పడింది. కానీ.. ఎవరూ అపీల్ చేయలేదు. నసీమ్ షా ఒక్కడే డౌట్‌ఫుల్‌గా అవుట్ ఏమో అని అనుకున్నా.. కీపర్, స్లిప్ ఫీల్డర్ నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడంతో.. పూర్తి స్థాయిలో అప్పీల్ చేయలేదు. దీంతో.. అంపైర్ కూడా గమ్మున ఉండిపోయాడు. కానీ.. రీప్లేలో చూసిన తర్వాత.. పాకిస్థాన్ ప్లేయర్లు నిద్రపోతూ ఆడుతున్నారా? అనే అనుమానం కలిగింది క్రికెట్ అభిమానులు. బాల్ చాలా క్లియర్‌గా బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతుల్లో పడినా.. దాన్ని అవుట్ కోసం అపీల్ చేయలేదు. దీంతో విలియమ్సన్‌ను అవుట్ చేసే గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు.
ప్రస్తుతం విలియమ్సన్ అవుటైనా.. పాక్ ప్లేయర్లు అపీల్ చేయకపోవడంతో బతికిపోయిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి.. పాక్ ఆటగాళ్లు వట్టి నిద్ర ముఖాల్లా ఉన్నారంటూ.. పాక్ క్రికెట్ అభిమానులే కామెంట్ చేస్తున్నారు. అయితే.. పాక్ ఆటగాళ్ల నిర్లక్ష్యంతో అవుట్ నుంచి బతికిపోయిన కేన్ మామ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మళ్లీ నసీమ్ షా వేసిన ఇన్నింగ్స్ 64వ ఓవర్ ఐదో బంతికి మళ్లీ కీపర్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇలా కేన్ మామ 36 పరుగులకే అవుట్ అవ్వడంతో.. పాకిస్థాన్ ఆటగాళ్లు బతికిపోయారనే చెప్పాలి. తొలి టెస్టులోలా.. ఇప్పుడు కూడా కేన్ మామ పరుగుల వరద పారించి ఉంటే.. ఆ భారం మొత్తం నసీమ్ షా, కీపర్ సర్ఫారాజ్పై పడేది. కాగా.. ప్రస్తుతం 3 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ 249 పరుగుల చేసింది. హెన్రీ నికోలస్ 10, డార్లీ మిచెల్ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మరి ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్ల తప్పిదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kane Williamson presses forward, gets a thin edge and Sarfaraz takes the catch; but Pakistan don’t appeal or review. A massive let-off?https://t.co/5y5pfmIaGJ#PAKvNZ
— Cricbuzz (@cricbuzz) January 2, 2023
Lovely bowling and a wonderful catch! 👏@iNaseemShah dismisses Kane Williamson #PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/OyDzAwNiqq
— Pakistan Cricket (@TheRealPCB) January 2, 2023