క్రీడాకారులు ఎక్కడున్నా వారిని అభినందించడమే అసలైన క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. క్రీడాస్ఫూర్తి కేవలం ఆటగాళ్లకు మాత్రమే కాదు అభిమానులకు కూడా ఉండాలి. అప్పుడే నిజమైన క్రీడా విధానం ప్రపంచ వ్యాప్తంగా వర్థిల్లుతుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ లో ఎంతో మంది అద్భుతమైన, నైపుణ్యం గల ఆటగాళ్లు ఉన్నారు. అలాంటి ఆటగాళ్లలో పాకిస్థాన్ ప్లేయర్ సౌద్ షకీల్ ఒకడు. అదేంటి ఇతడి పేరు ఇప్పటి వరకు ఎక్కడా విన్లేదే అని మీకు అనిపిచ్చవచ్చు. నిజమే అతడు క్రికెట్ లోకి అడుగుపెట్టి అచ్చంగా రెండు సంవత్సరాలు కూడా కాట్లేదు. అయితే అన్నం ఉడికిందా? లేదా? అని చూడటానికి అన్ని అన్నం మెతుకులను చూడం కదా! ఇదీ అంతే.. ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినప్పటికీ అతడి బ్యాటింగ్ లో ఓ నయా వాల్ కనిపిస్తున్నాడు. అవును అతడు పాక్ జట్టులో ఉన్న ఓ పుజారాలా వరల్డ్ క్రికెట్ కు కనిపిస్తున్నాడు.
సౌద్ షకీల్.. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో భవిష్యత్ ఉన్న ఆటగాళ్లలో ఒకడు. కచ్చితమైన బ్యాటింగ్ టెక్నీక్, ఫుట్ వర్క్, క్రీజ్ లో గంటలు గంటలు ఉండే ఓపిక ఇవన్ని ఒకే ఆటగాడిలో ఉంటే అతడే టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారా అని ఇప్పటి.. సగటు క్రికెట్ అభిమానులందరికి తెలుసు. ఇక ద్రవిడ్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పుజారా.. దానిని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరో ద్రవిడ్, పుజారాలను పోలిన ఆటగాడు పాకిస్థాన్ జట్టులో కనిపిస్తున్నాడు. అదే ఫుట్ వర్క్, అదే టెక్నీక్, అంతే ఓపికగా ఆడుతూ.. పాక్ కు భవిష్యత్ ఆశా కిరణంగా మారాడు. అతడే సౌద్ షకీల్.. ఇంత ఎలివేషన్ ఇచ్చాను అంటే ఇతడేదో వంద మ్యాచ్ లు ఆడాడు అనుకుంటే మీరు పొరపడినట్లే.. నిజానికి సౌద్ షకీల్ ఆడింది కేవలం 5 టెస్ట్ లు, 5 వన్డేలు మాత్రమే. మెున్న డిసెంబర్ లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా పాక్ జట్టులోకి అరంగేట్రం చేశాడు సౌద్ షకీల్.
ఇక 2021లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ తో వన్డేల్లోకి ప్రవేశించాడు షకీల్. సంప్రదాయ క్రికెట్ అయిన టెస్టుల్లో బ్యాట్స్ మెన్ కు ముఖ్యంగా ఉండాల్సింది ఓపిక. ఐదు రోజులు జరిగే టెస్ట్ లో క్రీజ్ లో నిలబడితే చాలు పరుగులు అవే వస్తాయని నానుడి ఉండనే ఉంది. అయితే యువ బ్యాటర్లకు ఇలాంటి నైపుణ్యం, ఓపిక ఉండదు. కానీ షకీల్ మాత్రం క్రీజ్ లో పాతుకు పోయే రకం. ఇది అతడి ఆటను బట్టే తెలుస్తోంది. దాంతో అతడిని జూనియర్ పుజారాగా ఫ్యాన్స్ పోలుస్తున్నారు. పుజారా సైతం ఇలాగే క్రీజ్ లో పాతుకుపోవడం మనందరికి తెలిసిందే. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు షకీల్. తాజాగా జరుగుతున్న రెండో టెస్ట్ లో 182 పరుగులకే 4 వికెట్లు పోయి కష్టాల్లో ఉన్న పాక్ జట్టును కెరీర్ లో తొలి సెంచరీతో ఆదుకున్నాడు. వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
MAIDEN TEST CENTURY 💯
Well played, @saudshak 🙌#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/Zm2kNt0g4J
— Pakistan Cricket (@TheRealPCB) January 4, 2023
దాంతో ప్రస్తుతం పాక్ 5 వికెట్ల నష్టానికి 349 పరుగులతో మూడో రోజు ఆట కోనసాగిస్తూనే ఉంది. క్రీజ్ లో ఆఘా సల్మాన్ (15) మరో వైపు పాక్ జూనియర్ పుజారా సౌద్ షకీల్ 275 బంతుల్లో 14 ఫోర్లతో 102 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ఇక సౌద్ షకీల్ కెరీర్ విషయానికి వస్తే.. కేవలం 5 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అతడు 1 సెంచరీ, 5 అర్ధశతకాలతో 523 పరుగులు సాధించాడు. అతడి సగటు 74.71 గా ఉండటం విశేషం. అయితే అతడు చేసిన పరుగులు తక్కువే కావచ్చు.. కానీ అతడి ఓపిక మాత్రం ఓ సీనియర్ బ్యాటర్ కు ఉన్నంత ఉందని మాత్రం చెప్పగలం అంటున్నారు క్రీడానిపుణులు. ప్రస్తుతం అద్భుతమైన ఆటతో టెస్ట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న షకీల్ భవిష్యత్ లో ఏవింధంగా రాణిస్తాడో వేచి చూడాలి.
A really classy innings 🙌
Special moment for @saudshak as his teammates rejoice 💫#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/HyEwiKzwEV
— Pakistan Cricket (@TheRealPCB) January 4, 2023