క్రికెట్ అభిమానులకు నాన్‌స్టాప్ వినోదం అందించే ఐపీఎల్‌మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోల్‌కత్తా నైట్ రైడర్స్ మేనేజ్‌మెంట్ శ్రేయస్ అయ్యర్ స్థానంలో కొత్త కెప్టెన్‌ను నియమించింది.
ఐపీఎల్ 2023 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం ఎప్పటిలాగే క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఐపీఎల్‌కు ముందే చాలా మంది స్టార్ క్రికెటర్లు గాయాలతో దూరం అయ్యారు. వారిలో శ్రేయస్ అయ్యర్ కూడా ఒకడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా వెన్నుగాయంతో మ్యాచ్‌కు దూరమైన శ్రేయస్.. దాని నుంచి కోలుకోకపోవడంతో ఐపీఎల్‌కు సైతం దూరం అవుతున్నాడు. అయితే.. శ్రేయస్ అయ్యర్ కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. అతను గాయం నుంచి ఐపీఎల్‌కు దూరం కావడంతో కేకేఆర్.. కొత్త కెప్టెన్‌ను ప్రకటించాల్సి వచ్చింది.
శ్రేయస్ అయ్యర్ కంటే ముందు నుంచి కేకేఆర్‌లో ఉన్న సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్‌కు జట్టును నడిపించే అవకాశం ఇస్తారని అంతా భావించారు. కానీ.. అనూహ్యాంగా కేకేఆర్ యాజమాన్యం యువ క్రికెటర్, ఆ జట్టు మిడిల్డార్ బ్యాటర్ నితిష్ రాణాకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరుకు ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. గాయంతో దూరమైన శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకుని ఈ సీజన్‌లోనే మ్యాచ్‌లు ఆడాలని కోరుకుంటున్నట్లు, అలాగే అతని స్థానంలో నితిష్ రాణా జట్టును విజయవంతంగా నడిపిస్తాడని ఆశిస్తున్నట్లు కేకేఆర్ పేర్కొంది. స్టేట్ టీమ్‌కు నితిష్ రాణా కెప్టెన్‌గా చేశాడని, ఆ అనుభవం ఇక్కడ పనికి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. మరి నితిష్‌ను కెప్టెన్‌గా ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Official statement. @NitishRana_27 #AmiKKR #KKR #Nitish #NitishRana pic.twitter.com/SeGP5tBoql
— KolkataKnightRiders (@KKRiders) March 27, 2023