వెస్టిండీస్ మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో వెస్టిండీస్ దారుణ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. పూరన్ విండీస్ కెప్టెన్సీని వదిలేసిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ తర్వాత.. అబుదాబి టీ10 లీగ్‌లో ఆడుతున్న పూరన్.. రెండు వరుస హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఇప్పటికే టీమ్ అబుదాబితో జరిగిన తొలి మ్యాచ్‌లో 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సులతో అదరగొట్టిన పూరన్.. శుక్రవారం నార్తర్న్ వారియర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 32 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సుతో 80 పరుగులు చేసి రాణించాడు.
శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ గ్లాడియేటర్స్.. నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఓపెనర్లు రాయ్ 18 పరుగుల చేసి అవుట్ కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన పూరన్ వారియర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్ల వర్షం కురిపిస్తూ.. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పూరన్ దెబ్బకి దక్కన్ గ్లాడియేటర్స్ 138 పరుగుల భారీ స్కోర్ చేసింది. వారియర్స్ బౌలర్లలో జునైద్, ఎమ్రిత్ తలో వికెట్ పడగొట్టారు. 139 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన వారియర్స్ జట్టు.. 114 పరుగులకే పరిమితం అయింది. నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు మాత్రమే చేసి.. 24 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. వారియర్స్ బ్యాటర్లలో ఓపెనర్ ఆడమ్ ఒక్కడే 51 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు విఫలం అవ్వడంతో.. ఓటమి తప్పలేదు.
టీ20 వరల్డ్ కప్‌కు ముందు కీరన్ పొలార్డ్ రిటైర్మెంట్ తర్వాత విండీస్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన పూరన్.. వరల్డ్ కప్‌లో జట్టును విజయవంతం నడిపించలేకపోయాడు. రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ సాధించిన జట్టు… తొలి సారి గ్రూప్ స్టేజ్‌లో స్కాట్లాండ్, ఐర్లాండ్ చేతుల్లో ఓటమి పొంది ఘోర అవమానాన్ని మూటగట్టుకుని, సూపర్ 12కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. పూరన్ విండీస్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అయితే ఐపీఎల్ 2022లో పూరన్‌ను రూ.10 కోట్లకు పైగా ధరపెట్టి కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ 2023కు మాత్రం పూరన్‌ను రిలీజ్ చేసింది. దీంతో పూరన్ మళ్లీ ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఉండనున్నాడు. కాగా.. అబుదాబి టీ10 లీగ్‌లో పూరన్ ప్రదర్శన ఆధారంగా ఐపీఎల్ వేలంలో అతనికి మరోసారి భారీ ధర దక్కే అవకాశం ఉంది.
Nicholas Pooran in T10 League:
– 77* (33).
– 80 (32).– Back to back blockbuster knocks from Pooran, he’s thoroughly enjoying! pic.twitter.com/V3pGyVC8GL
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 25, 2022