ఎంతో ఆతురతగా ఎదురుచూసిన మ్యాచ్ ఓడిపోతే అందరికీ బాధ కలుగుతుంది. కోపంలో ఒక మాట అంటాం. కానీ, అది ఎంతవరకు? దానికి హద్దు ఉండక్కర్లేదా? టీవీ ముందు కూర్చుని కమాన్ కమాన్ అని కేకలేసే మనకే అంత కసి ఉంటే.. ఒక దేశం కోసం ఆడుతున్న వాళ్లకు ఎంత కసి ఉంటుంది. ఆట అన్నాక ఒకళ్లు గెలుస్తారు.. ఒకరు ఓడుతారు. గెలిచినప్పుడు ఎలాగైతే భుజానికి ఎత్తుకుంటామో.. ఓటమి సమయంలోనూ అలాగే మద్దతుగా నిలవాలి. అది చాలా మందిలో కొరవడింది. ఒక టీమిండియా ప్లేయర్‌ను నువ్వు పాకిస్తానీ అంటూ ట్రోల్ చేశారు. అతనికి మద్దతుగా నిలిచిన వారిని సైతం కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా కామెంట్ చేస్తున్నారు.
ఒక జట్టు విజయం ఒక ఆటగాడి మీద ఆధారపడి ఉండదు. ఒకళ్లు సెంచరీ చేస్తే మ్యాచ్ గెలవరు. ఒకళ్లు 3 వికెట్లు తీస్తే మ్యాచ్ గెలవరు. జట్టు మొత్తం సమష్టి కృషి ఉంటేనే ఆ విజయం సాధ్యం అవుతుంది. ఒక మతాన్ని అడ్డుపెట్టుకుని షమీని ఇలా కామెంట్ చేయడం అసలు సమర్ధించదగినది కాదు. ఇదే షమీ 2015 ఐసీసీ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై అద్భుతంగా రాణించి 4 వికెట్లు పడగొట్టాడు. ఆ సమయంలో షమీ అసలైన భారతీయుడు.. ఇప్పుడు 43 పరుగులు ఇవ్వగానే పాకిస్తానీ అయిపోయాడు. ఇంతలా దిగజారి కామెంట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఖండించేవారు కూడా చాలా మందే ఉన్నారు. మాజీలు, అథ్లెట్లు అందరూ షమీకి మద్దతుగా నిలుస్తున్నారు. కన్నతండ్రి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ మైదానంలో ఇండియా కోసం ఆడిన వ్యక్తిని ఇలా కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Well done #Shami 💓
4 Wickets against 🇵🇰 in 2015 World Cup 👏👏👏👏
Poor pseudo nationalists modi bhakts, watch this 👇 and hide your head in cow dung right away 😂😂#indiaVsPakistan#gaddar#MohammadShami #IamShami pic.twitter.com/Cz6GmFbpRx
— THE BOSS (@Aestheticayush4) October 26, 2021
आपने हमेशा बेहतर से बेहतर प्रदर्शन किया है अपनी टीम के लिए जो आपके ऊपर उंगलियां उठा रहे हैं उनको आपका प्रदर्शन याद करना चाहिए हम सब आपके साथ है #Shami pic.twitter.com/eb2Gs0Dpfp
— ArifKhan (@arifkhanuk) October 26, 2021