మనలో చాలామందికి చాలారకాల భయాలు ఉంటాయి. ఇంగ్లీష్ రాకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని తెగ ఆలోచిస్తుంటారు. ఇక సెలబ్రిటీలు అన్న తర్వాత పలుచోట్లకు తిరగాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఆయా ప్రాంతాలకు చెందిన వారితో మాట్లాడాల్సి ఉంటుంది. అందరికీ అన్ని భాషలు రాకపోవచ్చు కానీ హిందీ, ఇంగ్లీష్ కామన్ గా తెలుసుంటాయి. కాబట్టి ఆ భాషల్ని కచ్చితంగా నేర్చుకోవాలి. అయితే కొందరు క్రికెటర్లకు కేవలం హిందీ మాత్రమే వచ్చుంటుంది. ఇక కామెంటేటర్, జర్నలిస్టులు ఇంగ్లీషులో ప్రశ్నలు అడిగితే ప్రాబ్లమ్ అవుతుంది. ఆ టైంలో సదరు ఆటగాళ్లు తిప్పలు పడిన వీడియోలు గతంలోనే చాలాసార్లు బయటపడ్డాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే… పాక్ జట్టులో ఈ మధ్య కాలంలో బాగా గుర్తింపు తెచ్చుకున్న బౌలర్ నసీమ్ షా. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లాడు. అయితే తొలి మ్యాచుకు ముందు ఫ్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా పాక్ యువ పేసర్ నసీమ్ షాని పలువురు జర్నలిస్టులు హిందీలో ప్రశ్నలు అడిగారు. ఓ రిపోర్టర్ మాత్రం.. వరసపెట్టి ఇంగ్లీష్ లో క్వశ్చన్ అడుగుతూ పోయాడు. జేమ్స్ అండర్సన్.. 40 ఏళ్ల వయసులోనూ ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నాడు కదా అని అడిగాడు. దీనికి నసీమ్ అదిరిపోయే సమాధానం చెప్పాడు.
‘అవును ఇది చాలా పెద్ద అచీవ్ మెంట్. నేను ఫాస్ట్ బౌలర్ ని కాబట్టి.. నాకు అది ఎంత కష్టమో తెలుసు. అతడో(జేమ్స్ అండర్స్) లెజెండ్. ఈ స్థాయికి రావడం కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. అతడిని కలిసినప్పుడు చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాను. చాలా నేర్చుకున్నాను కూడా. ప్రస్తుతం 40 ఏళ్లు వచ్చినా సరే అతడు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడో మీరు ఇది చూసి అర్థం చేసుకోవచ్చు’ అని నసీమ్ చెప్పుకొచ్చాడు. అయితే జర్నలిస్టు మరో క్వశ్చన్, ఇంగ్లీష్ లో అడిగేందుకు ప్రయత్నించగా.. ‘బ్రదర్, నాకు వచ్చిందే 30% శాతం ఇంగ్లీష్. ఇప్పుడు అదంతా మాట్లాడేశాను’ అని చెబుతూ నవ్వేశాడు. దీంతో అక్కడున్న వాళ్లు కూడా నవ్వేశారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో.. ఇది కాస్త వెలుగులోకి వచ్చింది.