టీమిండియా సీనియర్ స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ తన స్పీడ్ దెబ్బను ఆసీస్ యువ బ్యాటర్ పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌కు రుచిచూపించాడు. నాలుగో టెస్టు తొలి రోజు షమీ పడగొట్టిన హ్యాండ్స్‌కాంబ్ వికెట్ హైలెట్‌గా నిలిచింది.
అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన నాలుగో టెస్టు గురువారం ప్రారంభమైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఇప్పటికే మూడు టెస్టులు ముగిసిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో భారత్ ఘన విజయం సాధించగా.. మూడో టెస్టులో అనూహ్యంగా పుంజుకున్న ఆస్ట్రేలియా భారత్‌ను స్పిన్ మంత్రం తోనే ఓడించింది. మూడో టెస్టులో విజయంతో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరుకోగా.. భారత డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు భారత్.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే నాలుగో టెస్టులో కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఒక వేళ ఓడితే.. శ్రీలంక-న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిల్లో టీమిండియా మూడో టెస్ట్ ఓటమి తర్వాత నాలుగో టెస్టుకు ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. సిరాజ్ స్థానంలో షమీని తుది జట్టులోకి తీసుకున్నారు.
ఈ మార్పు భారత్‌కు మంచి ఫలితం ఇస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్-ఉస్మాన్ ఖవాజా మంచి ఆరంభాన్ని అందించారు. ఈ జోడీని అశ్విన్ విడదీశాడు. 61 పరుగుల వద్ద ఆసీస్ ట్రావిస్ హెడ్(31) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే షమీ లబుషేన్‌ను అవుట్ చేయడంతో 72 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. ఒక్కడి నుంచి మరో వికెట్ పడకుండా కొద్దిసేపు స్మిత్-ఖవాజా జోడీ భారత బౌలర్లను ఎదుర్కొంది. కానీ.. జడేజా వేసిన నార్మల్ డెలవరీకి చెత్త షాట్ ఆడిన జడేజా తన వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత క్రీజ్‌లో అప్పుడప్పుడే కుదురుకుంటున్న యువ క్రికెటర్ హ్యాండ్స్‌కాంబ్‌కు షమీ తన సీనియారిటీ దెబ్బ రుచిచూపించాడు.
షమీ వేసిన ఇన్నింగ్స్ 70వ ఓవర్ 4వ బంతికి హ్యాండ్స్‌కాంబ్ వికెట్ గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది. షమీ స్పీడ్‌కు వికెట్ గాల్లోకి ఎగిరిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా యువ బ్యాటర్‌కు షమీ స్పీడ్ దెబ్బ ఏంటో తెలిసిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం 84.1 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 96 పరుగులతో సెంచరీకి చేరువగా ఉన్నాడు. అతనితో పాటు కామెరున్ గ్రీన్ 30 రన్స్ చేసి క్రీజ్‌లో ఉన్నాడు. భారత్ బౌలర్లలో షమీ రెండు, జడేజా, అశ్విన్ చేరో వికెట్ తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో షమీ, హ్యాండ్స్‌కాండ్‌ను అవుట్ చేసిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The Shami magic 🔥pic.twitter.com/ZQMwqraK6w
— Johns. (@CricCrazyJohns) March 9, 2023