ఐపీఎల్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న బిగ్‌బాష్ లీగ్‌లో హ్యాట్రిక్ నమోదైంది. టీ20లో ఫాస్ట్ ఫుడ్ లాంటి క్రికెట్లో బ్యాటర్లదే హవా. బౌలర్ల డామినేషన్ చాలా తక్కువ. పరుగులు ఇవ్వకుండా మంచి ఎకానమీతో తమ కోటా ముగించుకంటే చాలనుకుంటారు టీ20 బౌలర్లు. కానీ.. అదే టీ20ల్లో హ్యాట్రిక్ సాధించి.. బ్యాటర్ల భరతం పట్టడం నిజంగా గొప్ప విషయమే. అలాంటి.. మ్యాజింగ్ బౌలింగ్‌ను బ్రిస్బేన్ హీట్ బౌలర్ మైఖేల్ నెసర్ వేశాడు. తొలి రెండో ఓవర్లలోనే ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి.. ప్రత్యర్థిని చావు దెబ్బతీశాడు. పైగా అందులో హ్యాట్రిక్ కూడా ఉండటం విశేషం. బిగ్ బాష్ లాంటి ప్రతిష్టాత్మక లీగ్‌లో హ్యాట్రిక్ సాధించడంతో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు నెసర్. బుధవారం మెల్బోర్న్ రెనెగేట్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ నెసర్ ఈ హ్యాట్రిక్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బెన్ హీట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. రెనెగేట్స్ బౌలర్లు టామ్ రోజర్స్ 4, హుస్సేన్ 3 వికెట్లతో చెలరేగడంతో బ్రిస్బెన్ తక్కువ స్కోర్‌కే పరిమితం అయింది. బ్రిస్బెన్ బ్యాటర్లలో జిమ్మి పీర్సన్ 30 బంతుల్లో 45 పరుగులతో రాణించడంతో ఆ మాత్రమైన స్కోర్ దక్కింది. 138 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన రెనెగేట్స్ను సైతం బ్రిస్బెన్ బౌలర్లు వణికించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే రెనెగేట్స్ ఓపెనర్ సామ్ హార్పర్‌ను అవుట్ చేసిన నెసర్.. రెనెగేట్స్కు ఊహించని షాకిచ్చాడు.
అదే ఓవర్లో చివరి బంతికి మరో వికెట్ తీసి.. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన నెసర్.. తొలి రెండు బంతులకు రెండు వికెట్లు పడగొట్టి.. వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసినందుకు హ్యాట్రిక్ సాధించాడు. దీంతో రెనెగేట్స్ 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే.. కరేబియన్ వీరుడు ఆండ్రూ రస్సెల్.. బ్రిస్బెన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని.. కొద్ది సేపు దడదడలాడించాడు. 42 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో 57 పరుగులు చేసిన రస్సెల్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హుస్సేన్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేయడంతో.. రెనెగేట్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో మైఖేల్ నెసర్ హ్యాట్రిక్ సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
WOW. 🎩🪄 #BBL12 pic.twitter.com/FraYtV5Tbk
— KFC Big Bash League (@BBL) December 21, 2022