ఐపీఎల్ 2023 కోసం ఆర్సీబీ ఆటగాళ్లు సిద్ధం అవుతున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్లు మినహా మిగతా ఆటగాళ్లు ఇప్పటికే క్యాంప్‌కు చేరిపోయారు. అయితే.. ఈ టీమ్‌కు ఒక స్టార్ ప్లేయర్ యాడ్ కానున్నాడు. అతను జట్టులో చేరితే.. ఆర్సీబీ మరింత బలపడటం ఖాయం.
ధనాధన్ క్రికెట్ ఐపీఎల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. క్రికెట్ ఫ్యాన్స్‌కు అంతులేని వినోదాన్ని పంచే ఐపీఎల్ ఈ నెల 31న మొదలుకానుంది. రెండున్నర నెలల పాటు నాన్‌స్టాప్ క్రికెట్ పండుగకు తెరలేవనుంది. ఎప్పటిలాగే ఈ ఐపీఎల్ కోసం కూడా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఐపీఎల్ ఆరంభం నుంచి ట్రోఫీ కోసం విశ్వప్రయత్నం చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు.. వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ కప్ కొట్టాలనే బలమైన సంకల్పంతో బరిలోకి దిగుతుంది. ఈ క్రమంలో టోర్నీ ఆరంభానికి కొన్ని రోజుల ముందే ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఆ జట్టు ఆటగాడు విల్ జాక్స్ గాయం కారణంగా ఐపీఎల్ 2023కు దూరం అయ్యాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ బరిలో దిగని ఈ ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ను ఆర్సీబీ ఐపీఎల్ 2023 వేలంలో దక్కించుకుంది. కానీ.. దురదృష్టవశాత్తు అతను బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడి.. ఐపీఎల్‌కు దూరం అయ్యాడు. అయితే అతని స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్, ప్రస్తుతం భీకరఫామ్‌లో ఉన్న బ్రేక్‌వెల్‌ను ఆర్సీబీ తీసుకోవాలిన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బ్రేస్‌వెల్‌తో ఆర్సీబీ యాజమాన్యం సంప్రదింపులు సైతం జరిపినట్లు తెలుస్తోంది. ఆర్సీబీ తరఫున ఆడేందుకు బ్రేస్‌వెల్ సైతం ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
అయితే.. బ్రేస్‌వెల్ ఆర్సీబీతో జతకడితే.. జట్టు మరింత పటిష్టం కావడం ఖాయం. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఆర్సీబీ దుర్బేధ్యంగా మారుతుంది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, రజత్ పటీదార్, మ్యాక్స్‌వెల్, ఫిన్ అలెన్, డినేష్ కార్తీక్, హెజల్‌వుడ్, సిరాజ్, హసరంగా, షాబాజ్ అహ్మెద్‌తో కూడిన జట్టుకు బ్రేస్‌వెల్ లాంటి ఆల్‌రౌండర్ తోడైతే మంచి ఫలితాలు సాధించవచ్చు. బ్రేస్‌వెల్‌ను ఆర్సీబీ తీసుకుంటుదనే వార్త తెలియడంతో సోషల్ మీడియాలో అప్పుడే ఆర్సీబీ అభిమానులు రచ్చ మొదలెట్టారు. ఈ సారి కప్ మనదే అనే నినాదాన్ని మరోసారి గట్టిగా వినిపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Breaking News: Will Jacks has been ruled out of the 2023 IPL due to injury. RCB have been in discussions with Michael Bracewell as his potential replacement. (Source: ESPNcricinfo)#Cricket #CricketNews #CricketTwitter #news #newsUpdates #Willjacks #IPL2023 #IPL #BreakingNews pic.twitter.com/ohJ7Il3l8Y
— CricInformer (@CricInformer) March 15, 2023