జాతీయ జట్టుకు దూరమైన తర్వాత మయాంక్ అగర్వాల్ రంజీల్లో విజృంభిస్తున్నాడు. తాజాగా సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో మయాంక్ అగర్వాల్ చెలరేగిపోయాడు. ఏకంగా డబుల్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
మయాంక్ అగర్వాల్ జాతీయ జట్టుకు దూరమై దాదాపుగా ఏడాది కావొస్తోంది. 2022 మార్చి నెలలో శ్రీలంకపై టెస్టు మ్యాచ్ ఆడాడు. జాతీయ జట్టుకు దూరమైన తర్వాత మయాంక్ రంజీల్లో చితక్కొడుతున్నాడు. తాజాగా సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో మయాంక్ అగర్వాల్ చెలరేగిపోయాడు. ఏకంగా డబుల్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఓవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా- ఇండియా మ్యాచ్ ఉత్కఠగా సాగుతున్న తరుణంలో కూడా అతని గురించే మాట్లాడుకనేలా చేశాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న కర్ణాటక జట్టును కెప్టెన్ గా ముందుంచి నడిపించాడు. ప్రస్తుతం అంతా మయాంక్ అగర్వాల్ కెప్టెన్ ఇన్నింగ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు.
రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర- కర్ణాటక మధ్య సెమీపైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో కర్ణాటక పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది. 255కే 7 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి 407 పరుగులు చేసే స్థితికి తీసుకెళ్లాడు. మొత్తం 626 నిమిషాల పాటు మయాంక్ అగర్వాల్ క్రీజులో నిలబడి పోరాడాడు. 429 బంతుల్లో 28 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో మొత్తం 249 పరుగులు చేశాడు. ఆఖర్లో రనౌట్ గా మయాంక్ పెవిలియన్ చేరాడు. నిజానికి కర్ణాటక చేసిన 407 పరుగుల్లో 249 మయాంక్ చేసినవే. అతని స్కోరు లేకపోతే కర్ణాటక పరిస్థితి చాలా కష్టం అయ్యేది. శ్రీనివాస శరత్ 66 పరుగులతో సపోర్ట్ చేశాడు.
ఇంక సౌరాష్ట్ర తమ ఛేజింగ్ లో మొదట్లోనే కాస్త తడబడినట్లుగా కనిపిస్తోంది. 20 ఓవర్లలోపే 2 వికెట్లను కోల్పోయింది. స్నెల్ పటేల్ డకౌట్ కాగా.. విశ్వరాజ్ జడేజా 22 పరుగలకు పెవిలియన్ చేరాడు. ఈ రెండు వికెట్లను విధావత్ కావేరప్ప పడగొట్టాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి సౌరాష్ట్ర 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. హార్దిక్ దేశాయ్(27*), షెల్డన్ జాక్సన్(27*) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సౌరాష్ట్ర 331 పరుగుల వెనుకంజలో ఉంది. రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా జరుగుతున్న ఈ రెండో సెమీ ఫైనల్ కాస్త ఆసక్తిగా సాగుతోంది.
The leading run scorer of #RanjiTrophy 2022-23 🧡
MAYANK AGARWAL. Remember the name 🔥#OrangeArmy #MayankAgarwal pic.twitter.com/wNcw4d566X
— SunRisers Hyderabad (@SunRisers) February 9, 2023