న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీతో కదం తొక్కాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. కానీ మొదటి వికెట్‌గా గిల్ అవుట్ అయిన తర్వాత పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకే ఓవర్‌లో అవుట్ అవ్వడంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే భారమంతా మయాంక్‌పై పడింది. దీంతో బాధ్యతాయుతంగా ఆడిన మయాంక్ 196 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో మయాంక్ కెరీర్‌లో నాలుగో సెంచరీని నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 65 ఓవర్లకు 207 పరుగులు చేసింది. మయాంక్, సాహా క్రీజ్‌లో ఉన్నారు.
💯 for @mayankcricket 👏👏
Live – https://t.co/KYV5Z1jAEM #INDvNZ @Paytm pic.twitter.com/0BcKYboHAj
— BCCI (@BCCI) December 3, 2021
The Test ton celebration 🎉@mayankcricket 👏#WTC23 | #INDvNZpic.twitter.com/UlIKCTynDO
— ICC (@ICC) December 3, 2021