క్రీడాలోకంలో నియమ, నిబంధనలు పాటిస్తూ.. క్రీడాస్ఫూర్తిని చాటడం ప్రతీఒక్క క్రీడాకారుడి బాధ్యత. కానీ కొంత మంది క్రీడాకారులు జట్టు ఓడిపోతుందని నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ లో ప్రవర్తిస్తూంటారు. నిన్న కాక మెున్న భారత మహిళల జట్టు చేసిన మాన్కడింగ్ పై వివాదం చెలరేగిన విషయం మనకు తెలిసిందే. దీనిని కొందరు మాజీలు సమర్ధించగా.. మరికొందరు విమర్శించారు. తాజాగా క్రీడా ప్రపంచంలో మరో వివాదానికి తెరలేపాడు ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూవేడ్. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ లో భాగంగా తాజాగా తొలి టీ20 జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 8 పరుగుల తేడాతో గెలిచిన సంగతి విదితమే. అయితే ఈ మ్యాచ్ లో నిబంధనలకు విరుద్దంగా క్యాచ్ అందుకునే బౌలర్ ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాడు వేడ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటనపై ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. తాజాగా జరిగిన తొలి టీ20 లో ఇంగ్లాండ్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఆ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన క్రీడాస్ఫూర్తికి విరుద్దమైనది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా విజయానికి 22 బంతుల్లో 49 పరుగులు అవసరం. క్రీజ్ అప్పటికే కుదురుకున్న వార్నర్-మాథ్యూవేడ్ ఉన్నారు. ఈ క్రమంలోనే మార్క్ వుడ్ బౌలింగ్ కు దిగాడు. ఈ ఓవర్ లో 3వ బంతిని వేడ్ హిట్ చేశాడు.. ఆ బంతి గాల్లోకి లేసింది, బంతి ఎటువైపు వెళ్లిందో వేడ్ తెలియకపోవడంతో పరుగుకు ప్రయత్నించాడు. దాంతో బంతిని చూసిన వార్నర్ పరుగు వద్దు అంటూ సైగ చేశాడు. వెంటనే వెనుదిరిగిన వేడ్ క్యాచ్ అందుకుందానికి వస్తోన్న మార్క్ వుడ్ ను కావాలనే తన ఎడమ చేయితో అడ్డుకున్నాడు. దాంతో వుడ్ కు క్యాచ్ పట్టే అవకాశం లేకుండా పోయింది.
అయితే క్రికెట్ నిబంధనలో ఉద్దేశపూర్వకంగా ఇలా అడ్డుకుంటే బ్యాట్స్ మెన్ ను అవుట్ గా ప్రకటించవచ్చు. అదీ కాక రిప్లేలో సైతం స్పష్టంగా వేడ్ కావాలనే వుడ్ ను అడ్డుకున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ అంపైర్లు అవుట్ ఇవ్వకపోవడంతో క్రీడాలోకం మెుత్తం వేడ్ తొండాట ఆడడు అంటూ విమర్శిస్తున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ మాట్లాడుతూ..”బంతి గాల్లోకి లేవడంతో నేను బంతివైపే చూస్తూ.. పరిగెత్తాను. వారిద్దరి మధ్య ఏం జరిగిందో నేను చూడలేదు. మార్క్ వుడ్ అంపైర్ కు అప్పీల్ చేయమనడంతో చేశాను. కానీ ఈ విషయాన్ని నేను పెద్దది చేయదలచుకోలేదు. ఎందుకంటే మేం టీ20 ప్రపంచ కప్ కోసం చాలా రోజులు ఇక్కడ ఉండాలి కాబట్టి.. చిన్న చిన్న విషయాలకు రిస్క్ తీసుకోదలచుకోలేదు” అని అన్నాడు. ఈ విషయంపై వేడ్ పై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. క్రీడాస్ఫూర్తికి ఇది విరుద్దం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెుదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్ 32 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్ లతో 68 పరుగులు చేయగా.. హేల్స్ 51 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్ లతో 84 రన్స్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో నాథన్ ఎలీస్ 3 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగుల వద్ద నిలిచి.. 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆసిస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్ లతో 73 పరుగులు చేస్తే.. మిచెల్ మార్ష్(36), స్టోయినిస్(35) పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు తీయగా, టోప్లే, కర్రన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు హేల్స్ కు లభించింది.
The CEO of Sportsman Spirit, M Wade, stopping M Wood from catching the ball!!
The OZs@azkhawaja1 pic.twitter.com/zAsJl6gpqz— WaQas Ahmad (@waqasaAhmad8) October 9, 2022