ఐపీఎల్ చూసిన వారికి శ్రీలంక పేసర్ పతిరానా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇక ఐపీఎల్ తర్వాత స్వదేశానికి వెళ్లిపోయిన పతిరానా.. ఈ లీగ్ పుణ్యమా అంటూ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఎవ్వరు ఊహించని విధంగా పతిరానా బౌలింగ్ చేయడం విశేషం.
“పతిరానా” ఐపీఎల్ లో ఈ పేరు బాగానే పాపులర్ అయింది. దీనికి కారణం చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చెన్నైకి ప్రధాన బౌలర్లు దూరమైనా సమయంలో పట్టుమని 20 ఏళ్ళు కూడా నిండని ఈ యంగ్ పేసర్ చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసి సీనియర్ ప్లేయర్ మలింగాని గుర్తు చేసాడు. దీంతో ఒక్కసారిగా పతిరానా పేరు ఐపీఎల్ లో మారు మ్రోగిపోయింది. ఇక అప్పటినుంచి ఈ యువ సంచలనాన్ని శ్రీలంక భవిష్యత్తు స్టార్ గా చాలా మంది క్రికెట్ ఎక్స్ పర్ట్స్ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ధోని సమక్షంలో బౌలింగ్ లో రాటుదేలిన పతిరానా.. ఇప్పుడు ఒక విషయంలో మాత్రం బాగా నిరాశ పరిచాడు.
క్రికెట్ లో ధోనికి భారీగా పరుగులిచ్చిన పెద్దగా కోపం రాదు కానీ .. ఎక్స్ట్రాస్ ఇస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. ఇదే విషయమై ఒకసారి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ మరొకసారి ఎక్స్ ట్రాల రూపంలో పరుగులు ఎక్కువగా ఇస్తే.. వేరే కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుందని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఇక అప్పటినుంచి చెన్నై బౌలర్లు ఈ తప్పు రిపీట్ కాకుండా చూసుకున్నారు. అయితే ఐపీఎల్ అయిపోయిన తర్వాత స్వదేశానికి వెళ్లిపోయిన పతిరానా.. ఐపీఎల్ పుణ్యమా అంటూ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అఫ్గానిస్తాన్ తో జరుగుతున్న తొలి వన్డేలో భాగంగా పతిరానా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. పరుగుల సంగతి అలా ఉంచితే ..ఈ మ్యాచులో పతిరానా వైడ్ ల వర్షం కురిపించాడు. ఎక్స్ ట్రాలు రూపంలో ఎక్కువ పరుగులిచ్చిన ఈ పేసర్.. ఏకంగా 16 వైడ్ లు వేయడం గమనార్హం.
మొత్తం 8.5 ఓవర్లు బౌలింగ్ వేసిన పతిరానా.. 66 పరుగులు ఇచ్చి జట్టు పరాజయానికి ఒక కారణమయ్యాడు. ధోని బౌలర్ గా కితాబులందుకున్న పతిరానా.. డెబ్యూ మ్యాచ్ లోనే ఇలా బౌలింగ్ చేయడం విచారకరం. ఇక ఈ మ్యాచులో శ్రీలంక విధించిన 269 పరుగుల లక్ష్యాన్ని మరో 19 బంతుల్లోనే మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. మొత్తానికీ డెబ్యూ మ్యాచులో అదరగొడతాడుకున్న పతిరానా ఇలా ఎక్స్ ట్రాల రూపంలో భారీగా పరుగులిస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
🎉🏏 Exciting moment for Matheesha Pathirana as he receives his One Day International cap from skipper Dasun Shanaka! 🙌#SLvAFG pic.twitter.com/2EaBAXYwzC
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 2, 2023