ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం చివరిదైన మూడో టెస్టు ప్రారంభమైంది. ఇప్పటికే మూడు టెస్టుల ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా తొలి రెండు టెస్టులు గెలిచి కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. మూడో టెస్టులోనూ తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. తొలి రోజు 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడగా.. రెండు వికెట్లు కోల్పోయి.. 147 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ హాఫ్ సెంచరీలు సాధించారు. రెండో మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో దుమ్ములేపిన డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌లో కేవలం 10 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. లబుషేన్ 151 బంతుల్లో 13 ఫోర్లతో 79 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అయితే.. ఈ మ్యాచ్‌లో లబుషేన్ ఒక ఆసక్తికరమైన పనిచేశాడు. మ్యాచ్ మధ్యలో తనకు సిగరేట్ లైటర్ కావాలంటూ.. ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నవారికి సైగలతో చెప్పాడు. మ్యాచ్ ఆడుతూ.. లబుషేన్‌కు సిగరేట్ లైటర్‌తో ఏంటి పని అనుకుంటున్నారా? అదే విషయం చాలా మందికి అర్థం కాలేదు. ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న ఇతర ఆటగాళ్లకు సైతం అతను సిగరేట్ లైటర్ ఎందుకు అడుగుతున్నాడో కాసేపు అర్థం కాలేదు. కొంపదీసి గ్రౌండ్‌లోనే సిగరేట్ తాగుతాడా ఏంటి? అని డౌట్ పడ్డారు. కానీ.. లబుషేన్ మరికొన్ని సిగ్నల్స్‌తో అర్థం చేసుకున్న డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఆటగాళ్లు పరుగు పరుగునా.. లైటర్ తీసుకొచ్చి లబుషేన్ చేతికిచ్చారు.
తీసుకొచ్చిన వారితో పాటు.. సౌతాఫ్రికా ఆటగాళ్లు, అంపైర్లతో పాటు స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన వారంతా.. లబుషేన్ ఆ లైటర్‌తో ఏం చేయబోతున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే.. లైటర్ అందుకున్న లబుషేన్ దాంతో నిప్పు వెలిగించి.. తన హెల్మెట్‌కు ఏమో రిపేర్లు చేసుకున్నాడు. హెల్మెట్ లోపల ఎక్స్‌ట్రా క్లాత్ ఏమైన లబుషేన్‌ను ఇబ్బంది పెట్టి ఉంటుంది.. దాన్ని నిప్పుతో కాల్చుతూ సరిచేశాడు. దీంతో.. సిగరేట్ లైటర్ కథ.. అందరికి నవ్వు తెప్పించింది. అయితే.. లబుషేన్ సిగరేట్ లైటర్ అడిగిన విధానం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిగరేట్ తాగుతున్న సైగలతో లబుషేన్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గా మారాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Running repairs for Marnus Labuschagne! 🚬#AUSvSA pic.twitter.com/IdSl0PqicV
— cricket.com.au (@cricketcomau) January 4, 2023