క్రికెట్ అంత ప్రమాదకరమైన ఆట కాదు. కానీ.. పేస్ బౌలర్లు సంధించే భయంకరమైన బౌన్సర్లను చూసినప్పుడు మాత్రం.. ఇంతకంటే ప్రమాదకరమైన ఆట మరొకటి ఉండదేమో అనిపిస్తుంది. గతంలో ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ ఓ డెడ్లీ బౌన్సర్‌కే బలైన విషయం తెలిసిందే. తాజాగా మరో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ సైతం ఆ డెడ్లీ బౌన్సర్ దెబ్బను రుచిచూశాడు. అయితే.. స్టార్క్ హెల్మెట్ ధరించి ఉండటంతో బతికిబట్టకట్టాడు అనిపిస్తోంది. ఆ భయంకరమైన బౌన్సర్‌ను చూస్తే.. క్రికెట్ ఆడేవారికి ఒళ్లు ఛల్లు మనడం ఖాయం. అయితే.. ఆ డెడ్లీ బౌలన్స్ వేసింది. ఎవరో కాదు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడే సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్. అతను వేసిన డెడ్లీ బౌన్సర్ బుల్లెట్‌లు దూసుకొచ్చి సరిగ్గా స్టార్క్ హెల్మెట్ మధ్య భాగంగా తగిలింది. హెల్మెట్ లేకపోయి ఉంటే.. స్టార్క్ తల కచ్చితంగా పది ముక్కలయ్యేదని.. నెటిజన్స్ పేర్కొంటున్నారు.
ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఆందోళనకర సంఘటన చోటు చేసుకుంది. మూడో రోజు టీ బ్రేక్‌కు ముందు ఇన్నింగ్స్ 145వ ఓవర్ చివరి బంతిని మార్కో షార్ట్ పిచ్‌గా వేశాడు. దాన్ని స్టార్క్ ఫుల్ చేయబోయి మిస్ టైమ్ అయ్యాడు. దీంతో బాల్ చాలా బలంగా అతని హెల్మెట్‌కు తాకింది. అదృష్టవశాత్తు హెల్మెట్ ఉండటంతో స్టార్క్‌కు ఏమీ కాలేదు. కానీ.. హెల్మెట్ లేకుంటే మాత్రం పెద్ద ప్రమాదమే జరిగేది. అయితే.. ఆ బాల్ తగిలిన తర్వాత.. హెల్మెట్ తీసి స్టార్క్ చిన్న నవ్వు చిందించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఆ బాల్ తర్వాత.. ఆస్ట్రేలియా ఇక బ్యాటింగ్ కొనసాగించలేదు. దెబ్బకు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మూడో రోజు టీ బ్రేక్‌కు ముందు 8 వికెట్లు కోల్పోయి 575 పరుగుల వద్ద ఆసీస్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. తొల ఇన్నింగ్స్‌లో 189 పరుగులు చేసింది. కేల్ 52, మార్క్ జాన్సెన్ 59 పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. ఇక ఆస్ట్రేలియా తమ తొలి 8 వికెట్ల నష్టానికి 575 పరుగుల భారీ స్కోర్ చేసింది. డేవిడ్ వార్నర్ 200 పరుగులు చేసి దుమ్ములేపడంతో.. ఆసీస్ అంత స్కోర్ చేసింది. అయితే.. చాలా కాలంగా టెస్ట్ ఫార్మాట్‌లో ఫామ్‌లోలేని వార్నర్ తన 100వ టెస్టులో మాత్రం మునుపటి ఫామ్‌ను అందుకుని.. ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. అతనికి తోడు అలెక్స్ క్యారీ సైతం 111 పరుగులు చేసి సెంచరీతో అదరగొట్టాడు. వీరితో పాటు స్టీవ్ స్మిత్ 85, ట్రెవిస్ హెడ్ 51, కామెరున్ గ్రీన్ 51 పరుగులతో రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో మార్కో జాన్సెన్ వేసిన డెడ్లీ బౌన్సర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Thankfully Mitch Starc looks ok after copping this bouncer to the head #AUSvSA pic.twitter.com/3RfuStXaNr
— cricket.com.au (@cricketcomau) December 28, 2022