ఐపీఎల్ 2022 మెగా వేలం ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. బెంగుళూరు వేదికగా జరిగే ఈ వేలంలో 590 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇందులో 370 మంది భారత క్రికెటర్లు ఉండగా, 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 1214 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోగా.. ఐపీఎల్ కమిటీ 590 మంది ఫైనల్చేసింది. ఈ ఫైనల్ లిస్ట్‌లో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా ఉన్నాడు.
గతంలో ముంబై ఇండియన్స్ అర్జున్ను కనీస ధర రూ.20 లక్షలకు అతన్ని కొనుగోలు చేసింది. కానీ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ కూడా ఐపీఎల్ వేలంలో పాల్గొననున్నాడు. అతని బేస్ ధర రూ.50 లక్షలు. అలాగే టీమిండియా ఆటగాడు, ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన స్పీడ్ స్టార్ శ్రీశాంత్ కూడా ఈ మెగా వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మరి వేలంలో ఈ ఆటగాళ్లకు ఎలాంటి ధర దక్కుతుంది, ఏ జట్టు కొనుగోలు చేస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.