భారత్-ఆస్ట్రేలియా మధ్య మరికొన్ని గంటల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గురించి.. భారత మాజీ హెడ్ కోచ్, ప్రఖ్యాత కామెంటేటర్ రవిశాస్త్రి ప్లేయింగ్ 11లో ఎవరిని ఆడించాలి అనేదానిపై టీమిండియాకు ఒక కీలక సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా రవిశాస్త్రీ మాట్లాడుతూ.. భారత్ లాంటి ఉపఖండపు పిచ్‌లపై స్పిన్నర్లు చాలా కీలక పాత్ర పోషిస్తారని.. దీనికి సంబంధించి ప్లేయింగ్ 11లో స్పిన్నర్లలో ఎవరిని ఆడించాలి అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. అశ్విన్, జడేజా ఇద్దరు భారత్‌లో ప్రధాన స్పిన్నర్లు వారిద్దరికీ జట్టులో చోటు కచ్చితంగా ఉంటుంది. మూడో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్‌కి బదులు కుల్దీప్ యాదవ్‌కి జట్టులో చోటు కల్పించాలని సూచించారు.
రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘జడేజా, అక్షర్ శైలి ఒకేలా ఉంటుంది.. పైగా ఇద్దరు కూడా ఆఫ్ స్పిన్నర్లే, ఎలాగు జడేజా తుది జట్టులో ఉంటాడు కనుక అక్షర్ పటేల్ అవసరం జట్టుకు పెద్దగా ఉండదు. కుల్దీప్ అయితే మొదటి రోజు నుంచే బంతిని తిప్పగలడు, పైగా ముగ్గురు ఆఫ్ స్పిన్నర్లు ఒకే జట్టులో ఉండడం వలన పెద్దగా ప్రయోజనం కూడా ఉండదు. అందుకే తుది జట్టులో కచ్చితంగా కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని రవిశాస్త్రి వ్యాఖ్యనించారు. మరి రవిశాస్త్రి చెప్పినట్లు టీమిండియా తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్‌తో బరిలోకి దిగుతుందో లేక బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉండాలని అక్షర్ పటేల్ వైపే మొగ్గుచూపుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ravi Shastri wants Kuldeep Yadav to play as India’s 3rd spinner vs Australia.
— Crickdom (@Crickdom7) February 7, 2023