గత కొంతకాలంగా సరైన ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఎట్టకేలకు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 64 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. గురువారం భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు లంకను తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేసినా.. భారత టాపార్డర్ బ్యాటర్లు శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం అవ్వడంతో మ్యాచ్ కాస్త టఫ్‌గా మారింది. ఈ క్రమంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి.. కేఎల్ రాహుల్ కీలక భాగస్వామ్యం నెలకొల్పడమే కాకుండా.. మ్యాచ్ చివరి వరకు నిలబడి మ్యాచ్ గెలిపించడంతో పాటు సిరీస్ విజయాన్ని సైతం అందించాడు.
అయితే.. కేఎల్ రాహుల్‌ను తుది జట్టులో ఆడించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్‌ను సైతం పక్కన పెట్టి.. వికెట్ కీపర్ రూపంలో రాహుల్‌ను ఆడిస్తుండటంపై క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. చాలా కాలంగా బ్యాటింగ్‌లో అత్యంత దారుణంగా విఫలం అవుతున్న రాహుల్.. కీపర్‌గానూ ఆకట్టుకునే ప్రదర్శన చేయడం లేదు. దీంతో.. రాహుల్‌ను టీమ్‌లో అనవసరంగా ఆడిస్తున్నారంటూ క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడ్డారు. కానీ.. వాటికి సమాధానంగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో మంచి ఇన్నింగ్స్ ఆడాడు రాహుల్. 103 బంతుల్లో 6 ఫోర్లతో 64 రన్స్ చేసి.. టీమ్‌ను ఆదుకున్నాడు.
అయితే ఈ మ్యాచ్ విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన రాహుల్.. తాను ఐదో స్థానంలోనే బ్యాటింగ్‌కు రావడానికి కారణం వివరించాడు. ‘వన్డే టీమ్‌లో తనను ఐదో స్థానంలో ఆడించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ పక్కా క్లారిటీతో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగా ఆడేందుకు నేను ప్రయత్నిస్తున్నాను’ అని రాహుల్ పేర్కొన్నాడు. అయితే.. టీ20ల్లో రాహుల్ ఓపెనర్‌గా ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సిరాజ్ 3, కుల్దీప్ యాదవ్ 3, ఉమ్రాన్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు. 216 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 43.2 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి ఛేదించింది. రాహుల్ 64, హార్దిక్ పాండ్యా 36 రన్స్‌తో రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో రాహుల్ ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Averaging 54.25 at No.5 for India in ODIs, has KL Rahul made this spot his own in a World Cup year? 🤔#INDvSL pic.twitter.com/JPKzEqQUvX
— ESPNcricinfo (@ESPNcricinfo) January 12, 2023