టీమిండియా స్టార్ క్రికెటర్ కేదార్ జాదవ్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి.. సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నాడు. తెల్లని లాల్చీపైజామాలో తిరుమలకు వచ్చిన జాదవ్‌తో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. చాలా మంది అతనితో సెల్ఫీలు దిగారు. జాదవ్ కూడా ఎవరీ కాదనకుండా వారితో ఫొటోలు దిగాడు. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ, ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌తో టీమిండియాకు ఆడిన జాదవ్.. తన పవర్ హిట్టింగ్‌తో అతి తక్కువ టైమ్‌లోనే మంచి ప్లేయర్‌గా ఎదిగాడు. కానీ.. పూర్ ఫామ్‌తో టీమిండియాలో స్థానం కోల్పోయాడు.
ఐపీఎల్ 2018లో జాదవ్‌ను రూ.7.80 కోట్ల భారీ ధరపెట్టి కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 2022 వరకు తమతోనే అంటిపెట్టుకుంది. 2021లో కేదార్ జాదవ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ బేస్ ధర రూ.2 కోట్లకు మాత్రమే దక్కించుకుంది. కానీ.. ఫామ్‌లో లేని జాదవ్‌ను జట్టులోకి తీసుకోవడంపై సన్‌రైజర్స్‌పై విమర్శలు వచ్చాయి. అందుకు తగ్గట్లే జాదవ్ ఆ సీజన్‌లోనూ విఫలం అయ్యాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో మాత్రం జాదవ్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజ్ ఆసక్తి చూపలేదు. దీంతో అతను ఐపీఎల్ 2022 మెగా వేలంలో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు.
ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున 73 వన్డేలు ఆడిన జాదవ్ 1389 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 9 టీ20ల్లో 122 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. కాగా.. ఐపీఎల్‌లో ఢిల్లీ, ఆర్సీబీ, చెన్నై, సన్‌రైజర్స్ తరఫున ఇప్పటి వరకు 93 మ్యాచ్‌లు ఆడి.. 1196 పరుగులు చేశాడు. అందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా.. కేదార్ జాదవ్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చాలా అవకాశాలు ఇచ్చాడనే విమర్శ ఉంది. కానీ.. జాదవ్ మాత్రం ధోని ఇచ్చిన ఛాన్స్‌లను సరిగా వినియోగించుకోలేదు.