”పడ్డచోటే నిలబడాలి.. అవమానించినప్పుడే అందనంత ఎత్తుకు ఎదగాలి” ఈ మాటను అక్షరాల నిజం చేశాడు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్. తాజాగా జరిగిన 2023 ఐపీఎల్ మినీ వేలంలో కేన్ మామను హైదరాబాద్ సన్ రైజర్స్ వదులుకుంది. దాంతో అతడిని ఏ ఫ్రాంఛైజీ వేలంలో కొనుగోలు చేయదని అందరు భావించారు. కానీ అనూహ్యంగా కేన్ మామను రెండు కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కుంది. తనను హైదరాబాద్ వదులుకుందన్న కసిని మెుత్తం పాకిస్థాన్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీ బాదీ తన సత్తా ఏంటో కావ్య పాపకు తెలిసేలా చేశాడు.
Take a bow, Kane Williamson!
📸: SonyLiv#CricTracker #KaneWilliamson #PAKvNZ pic.twitter.com/ilvfMXQrui
— CricTracker (@Cricketracker) December 29, 2022
కేన్ విలియమ్సన్.. వరల్డ్ క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎంతటి ఆటగాడికైనా కొన్ని గడ్డురోజులు వస్తాయి. తాజాగా జరిగిన 2023 ఐపీఎల్ మినీ వేలంలో అతడిని సన్ రైజర్స్ జట్టు వదులుకుంది. దాంతో బేస్ ప్రైస్ కే ఢిల్లీ క్యాపిట్స్ అతడిని దక్కించుకుంది. వేలం అనంతరం పాకిస్థాన్ తో ప్రారంభం అయితే టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్ లోనే దుమ్మురేపాడు కేన్ మామ. తనదైన బ్యాటింగ్ తో టెస్టుల్లో 5వ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. 395 బంతుల్లో 21 ఫోర్లు, సిక్స్ తో 200 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దాంతో కివీస్ జట్టు 9 వికెట్ల నష్టానికి 612 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ గా ప్రకటించింది. ఇక ఈ ఇన్నింగ్స్ లో టామ్ లాథమ్ సెంచరీ చేయగా, కాన్వే, ఇష్ సోథీలు అర్థశతకాలతో రాణించారు. ఇక పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దాంతో న్యూజిలాండ్ కు 174 పరుగుల విలువైన ఆధిక్యం లభించింది. కేన్ మామ డబుల్ సెంచరీ చేయడం సన్ రైజర్స్ కు షాక్ ఇచ్చినట్లు అయ్యింది. కేన్ విలియమ్సన్ కేవలం టెస్టులకు, వన్డేలకు మాత్రమే పనికొస్తాడనే భావనతో సన్ రైజర్స్ కేన్ మామను ఈ సారి వదులుకుంది.
A champion knock from a champion player! 👏#CricTracker #KaneWilliamson #PAKvNZ pic.twitter.com/r9hFwf2C2H
— CricTracker (@Cricketracker) December 29, 2022