టెస్టుల్లో చితక్కొట్టేస్తున్న కేన్ మామ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శ్రీలంకతో రెండో టెస్టులో రెచ్చిపోయి మరీ బ్యాటింగ్ తో చేశాడు. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డ్ సృష్టించాడు.
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈరోజు ఫెయిలైనవాడు రేపు సక్సెస్ తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వొచ్చు. కాకపోతే ఇక్కడ వెయిట్ చేయడం మాత్రమే ఉంటుంది. ఒక్కసారి వాళ్లు గనక కమ్ బ్యాక్ ఇస్తే సక్సెస్ ట్రాక్ లో పడితే రచ్చ రచ్చ అయిపోవడం గ్యారంటీ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే.. మన తెలుగువాళ్లు ముద్దుగా పిలుచుకునే కేన్ మామ రెచ్చిపోయి ఆడుతున్నాడు. మొన్నటివరకు బ్యాటింగ్ లో ఫెయిలైనోడు కాస్త తాజాగా సెంచరీల మీద సెంచరీలు కొడుతూ రికార్డులు సృష్టిస్తున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం న్యూజిలాండ్-శ్రీలంక మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఈ మధ్య తొలి టెస్టులో విజయం సాధించిన కివీస్.. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు టీమిండియా చేరడానికి కారణమైంది. ఆ మ్యాచులో అద్భుతమైన సెంచరీ చేసిన విలియమ్సన్ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు జరుగుతున్న రెండో టెస్టులో అయితే రెచ్చిపోతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 580/4 స్కోరు దగ్గర కివీస్ డిక్లేర్ చేసింది. విలియమ్సన్ (215)తో పాటు హెన్రీ నికోలస్ (200) డబుల్ సెంచరీలతో అదరగొట్టారు.
285 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన విలియమ్సన్.. టెస్టు కెరీర్ లో 6వ దాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ద్రవిడ్, రూట్ ని అధిగమించిన కేన్ మామ.. సచిన్, సెహ్వాగ్ ఆరు ద్విశతకాల రికార్డుని సమం చేశాడు. టెస్టుల్లో ఇప్పటివరకు అత్యధిక డబుల్ సెంచరీల రికార్డ్ సర్ డాన్ బ్రాడ్ మన్ పేరిట ఉంది. 52 టెస్టులాడిన ఆయన ఏకంగా 12 డబుల్ సెంచరీలు చేశారు. ఇదిలా ఉండగా విలియమ్సన్ కు ఇది హ్యాట్రిక్ సెంచరీ కావడం విశేషం. ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో 132, శ్రీలంకతో తొలి టెస్టులో 121 పరుగులు చేసిన ఇతడు.. తాజాగా 215 రన్స్ చేశాడు. కేన మామ ఊపు చూస్తుంటే.. ఐపీఎల్ లోనూ దంచికొట్టేలా ఉన్నాడు. గతేడాది వరకు హైదరాబాద్ కు ఆడిన ఇతడు.. ఈ సీజన్ నుంచి గుజరాత్ జట్టు తరఫున బరిలో దిగుతాడు. మరి కేన్ సరికొత్త రికార్డులు నమోదు చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Kane Williamson makes it a double 💯💯
His sixth in Tests!
https://t.co/TnCgxMjPti #NZvSL pic.twitter.com/Sb0Y4JdzlE
— ESPNcricinfo (@ESPNcricinfo) March 18, 2023