మహిళల ఐపీఎల్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ లో సత్తా చాటిన ఢిల్లీ బ్యాట్స్ వుమెన్.. తర్వాత తన మాస్ డ్యాన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఐపీఎల్ ఆరంభానికి ముందే ఓ పొట్టి క్రికెట్ లీగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అదే వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL). ఘనంగా ప్రారంభం అయిన 2023 తొలి సీజన్ లో లేడీ క్రికెటర్లు దుమ్మురేపుతున్నారు. స్టార్టింగ్ మ్యాచ్ ల్లోనే భారీ స్కోర్లతో తాము పురుషులకు ఏ మాత్రం తీసిపోమని చాటి చెప్పారు. ఇక ఓ మహిళా క్రికెటర్ అయితే ఆటలోనే కాకు డ్యాన్స్ లోనూ మాకు పోటీలేరు అని తన డ్యాన్స్ తో నిరూపించింది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా లేడీ క్రికెటర్ తన మాస్ డ్యాన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మహిళల ఐపీఎల్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 60 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ లో సత్తా చాటిన ఢిల్లీ బ్యాట్స్ వుమెన్.. తర్వాత తన మాస్ డ్యాన్స్ తో ఉర్రూతలూగించింది. ఆమె ఎవరో కాదు.. టీమిండియా స్టార్ లేడీ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్వెజ్. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జెమీమా.. గ్రౌండ్ లో ఒక్కసారిగా మ్యూజిక్ ప్లే కావడంతో.. తనలో ఉన్న డ్యాన్సర్ ను బయటికితీసింది. ఆ బీట్ కు అనుగుణంగా మాస్ స్టెప్పులు వేసి అదరగొట్టింది. దాంతో ఆమె డ్యాన్స్ చూసిన అభిమానులు ఈలలు, గొలలు చేస్తూ.. అరిచారు. ఓ ప్రొఫెషనల్ డ్యాన్సర్ లా తన డ్యాన్సింగ్ స్కిల్స్ ను ప్రపంచానికి చూపెట్టింది జెమీమా రోడ్రిగ్వెజ్.
అయితే ఒక్కసారి కాదు ఇలా ఫీల్డింగ్ టైమ్ లో చాలా సార్లే తన డ్యాన్స్ స్కిల్స్ ను చూపెట్టింది జెమీమా. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాంతో తన డ్యాన్స్ పై వచ్చే కామెంట్స్ కు తను స్పందించడమే కాకుండా వీడియోను రీ ట్వీట్ కూడా చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరును సాధించింది. జట్టులో డ్యాషింగ్ బ్యాట్స్ వుమెన్ షెఫాలీ వర్మ 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసింది. మెగ్ లాన్నింగ్ (72), కాప్(39*) రోడ్రిగ్వెజ్(22*) పరుగులతో రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్ తారా నోరీస్ (5/29) బెంబేలెత్తించింది. దాంతో 60 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.
@JemiRodrigues Here she goes again…😍 #WPL2023 #RCBvsDC @wplt20 @IPL pic.twitter.com/c9vmxXvJv0
— Ambika Kusum (@ambika_acharya) March 5, 2023
@JemiRodrigues Do u think that was it??? Nah, the girls on a roll my dear 🤣😘😘 pic.twitter.com/YF11fdWOGq
— Ambika Kusum (@ambika_acharya) March 5, 2023
@JemiRodrigues I have more girl… 😘😘 #WPL2023 #RCBvsDC pic.twitter.com/eEZ7b7aGf1
— Ambika Kusum (@ambika_acharya) March 5, 2023