ఎప్పుడో 2010లో టీమిండియా తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ జట్టులో స్థానం దక్కలేదు. అయినా కూడా పట్టువదలకుండా.. దేశవాళీ క్రికెట్‌లో శ్రమిస్తూనే ఉన్నాడు. అతని 12 ఏళ్ల కష్టానికి మరోసారి సువర్ణావకాశం దక్కింది. మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం ఆడేందుకు సెలెక్టర్లు ఎంపిక చేశారు. కానీ.. విధి మాత్రం అతని అదృష్టంతో ఆడుకుంది. 12 ఏళ్ల తర్వాత దక్కిన అవకాశాన్ని ఒక సిల్లీ కారణంతో.. తొలి టెస్టుకు దూరం చేసింది. బీసీసీఐ కరుణించినా.. విధి వెక్కిరింతకు గురైన ఆ క్రికెటర్ మరెవరో కాదు.. టీమిండియా వెటరన్ క్రికెటర్ జయ్‌దేవ్ ఉనద్కట్.
ఆస్ట్రేలియాతో టీ20 వరల్డ్ కప్ జరుగుతుండగానే.. వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో జరగబోయే సిరీస్‌ల కోసం చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక‌్షన్ కమిటీ జట్లను ఎంపిక చేసింది. అయితే.. బంగ్లాదేశ్ సిరీస్ కోసం ఎంపిక చేసిన టీమిండియా సీనియర్ బౌలర్ మొహమ్మద్ షమీ గాయపడ్డంతో అతను సిరీస్‌కు దూరం అయ్యాడు. అతని స్థానంలో టీమిండియా వెటరన్ ప్లేయర్.. దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న జయదేవ్ ఉనద్కట్‌ను ఎంపిక చేశారు. దీంతో 12 ఏళ్ల తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకునే అవకాశం దక్కడంతో ఉనద్కట్ సంతోషంతో ఉబ్బితబ్బియ్యాడు. కానీ.. తొలి టెస్టు ఆడే అవకాశం మాత్రం చిన్న సమస్యతో దూరమైంది.
షమీ స్థానంలో ఉనద్కట్‌ను చివరి క్షణంలో ఎంపిక చేయడంతో.. ఉనద్కట్‌కు వీసా సమస్యలు తలెత్తాయి. తొలి టెస్టు కంటే ముందే.. ఉనద్కట్‌ను బంగ్లాదేశ్ పంపే ప్రయత్నాలను బీసీసీఐ చేసినా.. అవి ఫలించలేదు. దీంతో ఉనద్కట్ తొలి టెస్టుకు దూరం అయ్యాడు. ఉనద్కట్ కెప్టెన్సీలోని సౌరాష్ట్ర జట్టు ఇటివల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీని గెలిచింది. ఈ టోర్నీలో ఉనద్కట్ ప్రదర్శన ఆధారంగా అతనికి జాతీయ జట్టులో చోటు దక్కింది. మకాగా.. టీమిండియా తరఫున 2010లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఉనద్కట్.. జాతీయ జట్టు తరఫున పెద్దగా రాణించలేదు. 2013లో టీమిండియా తరఫున 7 వన్డేలు ఆడి 8 వికెట్లు తీశాడు. అలాగే 2016-18 మధ్య 10 టీ20 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. ఇక 2010లో టీమిండియా తరఫున సెంచూరియన్‌లో జరిగిన ఒకే ఒక టెస్టులో ఆడిన ఉనద్కట్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. మరి ఉనద్కట్ దురదృష్టంపై, బీసీసీఐ నిర్లక్ష్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jaydev Unadkat#BANvIND #INDvsBAN pic.twitter.com/usVBD7UJTz
— RVCJ Media (@RVCJ_FB) December 13, 2022
Jaydev Unadkat with Indian Test jersey after 12 long years. pic.twitter.com/8ef02dsccm
— Johns. (@CricCrazyJohns) December 12, 2022