ఆసియా కప్ క్రికెట్ టోర్నీని ఈ సారి హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ మండలి రిలీజ్ చేసింది. ఇక ఈ టోర్నీ కోసం కొంతమంది టీమిండియా స్టార్స్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఐపీఎల్ ముగిసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ అయిపోయింది. ఈ నేపథ్యంలో త్వరలో రానున్న ఆసియా కప్ మెగా టోర్నీ కోసం ఎదురు చూస్తున్నారు క్రికెట్ అభిమానులు. వరల్డ్ కప్ కి ముందు ఈ టోర్నీ నిర్వహించనున్నారు. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ జరగనుంది. ఇదిలా ఉండగా తాజాగా.. ఆసియా కప్ క్రికెట్ టోర్నీని ఈ సారి హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ మండలి రిలీజ్ చేసింది. ఇక ఈ టోర్నీ కోసం కొంతమంది టీమిండియా స్టార్స్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ ఆసియా కప్ ఆడుతున్నట్లుగా దాదాపు ఖరారైంది. ఇంతకీ ఆ స్టార్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
టీమిండియాలోని కొంతమంది స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్ తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ లిస్టులో పంత్, బూమ్రా, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ ఉన్నారు. అయితే రాహుల్ కోలుకున్న సంగతి తెలిసిందే. ఇక పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా బూమ్రా, శ్రేయాస్ అయ్యర్ కూడా గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం.అంతే కాదు వీరిద్దరూ ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్ లో ఆడుతుండడం ఇప్పుడు టీమిండియా అభిమానులకి సంతోషాన్ని కలిగిస్తుంది.
బూమ్రా, శ్రేయాస్ అయ్యర్ టీమిండియాకు ఎంత కీలక ప్లేయర్లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి గైరుహాజరీలో తమ ఐపీఎల్ జట్లు, అదే విధంగా టీమిండియా మీద తీవ్ర ప్రభావం చూపించాయి. ఐపీఎల్ కి ముందు వీరి గాయాల తీవ్రత ఎక్కువ కానుండడంతో ఆసియా కప్ కి వరల్డ్ కప్ కి ఆడతారా? లేదా ? అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. అయితే ఇప్పుడు బూమ్రా, శ్రేయాస్ అయ్యర్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది. ఇండియా, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ జట్లు ఆసియా కప్ లో ఆడతాయి. మొత్తానికి టీమిండియా స్టార్లు బూమ్రా, శ్రేయాస్ రీ ఎంట్రీ ఇవ్వడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.