40 ఏళ్ల వయసులో చాలా మంది క్రికెటర్లు ఆట నుంచి రిటైర్ అయిపోయి.. కామెంటర్‌గానో, కోచ్‌గానే ఓ ఐదు, పదేళ్ల అనుభవం సంపాదించి ఉంటారు. కానీ.. ఓ క్రికెటర్ మాత్రం 40 ఏళ్ల వయసులో వరల్డ్ నంబర్‌గా అయ్యాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో మహా అయితే ఓ 10, 15 ఏళ్ల కెరీర్ ఉంటే గొప్ప క్రికెటర్‌గా భావిస్తారు. చాలా తక్కువ మందికి అంతకు మించి లాంగ్ కెరీర్ ఉంటుంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఏకంగా 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగించారు. అయితే ఒక బ్యాటర్‌గా సచిన్ లాంగ్ కెరీర్ కలిగి ఉండటం ఒకెత్తయితే.. ఒక బౌలర్ 21 ఏళ్ల కెరీర్‌ను కొనసాగిస్తూ యువ బౌలర్లతో పోటీ పడుతూ దాదాపు 40 ఏళ్లు పైబడిన వయసులో వరల్డ్ నంబర్ బౌలర్‌గా నిలవడం ఒకెత్తు. నిజానికి అది అసాధారణం. ఎందుకంటే ఒక స్పీడ్ బౌలర్ కెరీర్ స్ప్యాన్ చాలా తక్కువ. శరీరంగా అధిక శ్రమ వల్ల పేస్ బౌలర్లు తరుచు గాయాల పాలవుతుంటారు. అందుకే వారి కెరీర్‌తో త్వరగా ముగుస్తుంది. ఒక వేళ లాంగ్ కెరీర్‌ను కొనసాగించినా.. నిలకడంగా రాణించడం అంత సులువైన విషయం కాదు.
ఇలాంటి అడ్డుంకులన్ని బద్ధలుకొడుతూ.. ఒక్కడు మాత్రం చరిత్ర సృష్టించాడు. అతనే ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జెమ్స్ అండర్సన్. 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అండర్సన్ ఇప్పటికీ కెరీర్ కొనసాగించడమే గొప్ప అనుకుంటే.. 40 ఏళ్ల వయసులో టెస్టు క్రికెట్‌లో మరోసారి వరల్డ్ నంబర్ వన్ బౌలర్ స్థానాన్ని అధిరోహించి కొత్త చరిత్ర లిఖించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో వరల్డ్ నంబర్ 2 నుంచి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన ఏడాది పుట్టిన వాళ్లు కూడా క్రికెటర్లుగా ఎదిగి కొన్ని మ్యాచ్‌లు ఆడి కనుమరుగైపోయారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి చిన్న వయసులోనే ఎంట్రీ సరిగ్గా రాణించలేక కెరీర్‌ను ముగించిన వారు బోలెడు మంది ఉన్నారు.
కానీ.. 2002లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి అప్పటి నుంచి ఇంగ్లండ్ జట్టులో కీ బౌలర్‌గా స్థిరపడిపోయాడు అండర్సన్. ప్రపంచ క్రికెట్‌లో ఎవరీ సాధ్యంకానీ రికార్డులను నెలకొల్పాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పీడ్ బౌలర్‌గా నిలిచాడు. 600 ప్లస్ టెస్ట్ వికెట్లు తీసిన పేసర్ అండర్సనే. అలాగే అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్. సచిన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు 178 టెస్టుల్లో 682 వికెట్లు తీసుకున్నాడు. అలాగే 194 వన్డేల్లో 269, 19 టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. అలాగే టెస్టుల్లో 1308 రన్స్ కూడా అండర్సన్ ఖాతాలో ఉన్నాయి. ఈ రికార్డులన్నీ ఒకెత్తు అయితే.. 40 ఏళ్ల వయసులో టెస్టు క్రికెట్‌లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్ కావడం సాధారణమైన విషయం కాదు. ఎందరో యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకం. మరి అండర్సన్ సాధించిన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
It’s James Anderson’s world, we’re just living in it 😍#JamesAnderson #Cricket #ICCRankings #England #NZvsENG pic.twitter.com/u79ESp8ZFl
— Wisden (@WisdenCricket) February 22, 2023