క్రికెట్ ప్రపంచంలో గతంలో దశాబ్దానికి ఒక క్రికెటర్ వెలుగులోకి వచ్చేవాడు. ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమాని సీజన్ కు ఒకళ్లు కాదు.. ఇద్దరు కాదు.. చాలా మందే వస్తున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే 22 ఏళ్ల యువ సంచలనం ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడకుండానే ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడే.. ఐర్లాండ్ బ్యాట్స్ మన్.. హ్యారీ టామ్ టెక్టర్.. క్రీడా ప్రపంచంలో ఇప్పుడీ పేరు మారుమోగి పోతోంది. మరి అతడి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం పదండి..
హ్యారీ టెక్టర్.. డిసెంబరు 6, 1999లో ఐర్లాండ్ లోని డబ్లిన్ లో జన్మించాడు. 2020లో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సీరిస్ తో తన కెరీర్ ను ప్రారంభించాడు. అప్పుడు అతన్ని అందరూ ఓ అనామక ఆటగాడిగానే చూశారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు అందరి దృష్టి అతని మీదే.. వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్ నే అతడు వణికిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ టాపార్డర్ బ్యాట్స్ మన్ ఐర్లాండ్ జట్టుకు వెన్నముకగా నిలుస్తున్నాడు.
22-year-old Harry Tector in the last 14 ODI matches for Ireland:
30*(59)
58(100)
25(28)
79(68)
29(34)
50(55)
55(42)
13*(16)
53(68)
54*(75)
52(76)
113(117)
4(25)
108(106) pic.twitter.com/gChqSPAYKg— Johns. (@CricCrazyJohns) July 15, 2022
ప్రస్తుతం అతడు ఈ సీరిస్ లో రెండు శతకాలు బాది కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో ఒక్కసారిగా అతడు అందరి దృష్టిని ఆకర్షించాడు. గతంలో టెక్టర్ భారత్ తో జరిగిన టీ20లో 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీనిపై అప్పట్లోనే హార్దిక్ పాండ్యా స్పందించాడు. టెక్టర్ త్వరలోనే ఐపీఎల్ లోకి అడుగుపెడతాడంటూ.. అతనికి తన బ్యాట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు.
Harry Tector in ODIs in 2022:
6 innings
2 hundreds
3 fifties— ESPNcricinfo (@ESPNcricinfo) July 16, 2022
తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సీరిస్ లో కూడా హ్యారీ టెక్టర్ దుమ్ములేపుతున్నాడు. అతని ఆట చూసిన మాజీలు టెక్టర్ ఓ గొప్ప క్రికెటర్ అవ్వటం ఖాయం అంటున్నారు. ఐర్లాండ్ కు మరో విరాట్ కోహ్లీ అవుతాడని కొందరు నెటిజన్స్ అంటున్నారు. టెక్టర్ కెరీర్ ని పరిశీలిస్తే.. 23 వన్డేల్లో 47.11 సగటుతో 895 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 7 అర్దశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 113 పరుగులు.
Players to score 2 centuries vs New Zealand in a series since 2016:
David Warner (2016)
Harry Tector (2022) pic.twitter.com/S14HbzrwzO— Random Cricket Stats (@randomcricstat) July 15, 2022
ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏంటంటే.. ఆ రెండు శతకాలు న్యూజిలాండ్ మీదే బాదడం విశేషం. అలాగే 34 టీ20ల్లో 26.79 సగటుతో 643 పరుగులు చేశాడు. భారత్ పై చేసిన 64 పరుగులే ఇతని బెస్ట్ స్కోర్. టెక్టర్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ ఇన్నింగ్స్ లు ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఐర్లాండ్ క్రికెట్ కు శుభసూచకం అని చెప్పొచ్చు. శతకాలతో న్యూజిలాండ్ జట్టుకే చమటలు పట్టించిన హ్యారీ టెక్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Harry Tector has only been dismissed once before reaching 50 in his last nine ODI innings.
What a talent.
SCORE: https://t.co/iHiY0Un8Zh#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/LlFUkf0Xe3
— Cricket Ireland (@cricketireland) July 15, 2022