ఐపీఎల్ 2022 సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు మంచి ప్రదర్శనను కనబరుస్తోంది. గురువారం (ఏప్రిల్ 14) రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. 5 మ్యాచుల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరుకుంది. అయితే.. ఈ మ్యాచ్ లో జరిగిన ఒక సంఘటన అందరకి నవ్వులు తెప్పిస్తోంది. ఏంటా అంటారా?. అయితే ఇది చదివాల్సిందే మరి.
మ్యాచుకు ముందు బట్లర్ చేతిలో.. ఇన్నింగ్స్ అయ్యాక హార్దిక్ చేతికి..
గుజరాత్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచుకు ముందు.. బట్లర్ 218 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అంటిపెట్టుకొని ఉన్నాడు. అదే సమయంలో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 141 పరుగులతో దరిదాపుల్లో కూడా లేడు. కానీ, గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలో, హార్దిక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 87 పరుగులు చేసిన హార్దిక్.. ఇన్నింగ్స్ ముగిసేసరికి 228 పరుగులతో బట్లర్ ను అధిగమించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ విరామ సమయంలో హార్దిక్ కు ఆరెంజ్ క్యాప్ అందించారు. కానీ, అది ఎక్కువ సేపు నిలవలేదు. ఈ సమయంలో హార్దిక్ తనను అధిగమించాడన్న విషయం తెలుసుకున్న బట్లర్.. ఆరంజ్ క్యాప్ తీసేసి ప్యాంటులో పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Such a gentleman Jos Buttler is .. pic.twitter.com/m42ATqL7tN
— That-Cricket-Girl (@imswatib) April 14, 2022
ఇది కూడా చదవండి: మూడో గెలుపుపై SRH ధీమా! ఏకంగా పవన్‌ను వాడుకున్నారు
మ్యాచ్ అయ్యాక మళ్ళీ బట్లర్ చెంతకే..
గుజరాత్ నిర్ధేశించిన 192 లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ కు దిగిన బట్లర్ (రాజస్థాన్ రాయల్స్) ఆరెంజ్ క్యాప్ మళ్లీ తన వశం చేసుకోవడానికి కేవలం నాలుగు బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇన్నింగ్స్ మొదటి బంతిని డాట్ చేసిన బట్లర్.. తరువాత వరుసగా మూడు ఫోర్లు కొట్టడం ద్వారా 10 పరుగుల ఖాళీని పూరించాడు. మొత్తంగా ఈ మ్యాచులో బట్లర్ 54 పరుగులు చేశాడు. ఫలితంగా ఆరెంజ్ క్యాప్ రేసులో హార్దిక్ పాండ్యాను అధిగమించాడు.
Orange Cap be like..#IPL2022 #RRvGT pic.twitter.com/iQH2tZ5746
— RVCJ Media (@RVCJ_FB) April 14, 2022
ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు:
జాస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్): 272 పరుగులు
హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్): 228 పరుగులు
శివమ్ దూబే (చెన్నై సూపర్ కింగ్స్): 207 పరుగులు
శుభమన్ గిల్ (గుజరాత్ టైటాన్స్): 200 పరుగులు
షిమ్రాన్ హిట్మెయర్ (రాజస్థాన్ రాయల్స్): 197 పరుగులు
Orange Cap holder as of now in IPL 2022. pic.twitter.com/jOHoBsVbRq
— Cricket Addictor (@AddictorCricket) April 15, 2022
ఇది కూడా చదవండి: బట్లర్‌ను చూసి నేర్చుకోవాలి: యువరాజ్ సింగ్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.