ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ 6 మ్యాచ్‌లలో 5 గెలుపులతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. CSKపై గుజరాత్ టైటాన్స్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ విశ్వరూపం చూపించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో చివరి ఓవర్లో జోర్దాన్ వేసిన నో బాల్ కారణంగా ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన మిల్లర్ గుజరాత్‌కు 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. CSKను మాత్రం నో బాల్ ముంచింది. ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ పట్టు వదలకుండా ఒంటరి పోరాటం చేసిన మిల్లర్ 8 ఫోర్లు, 6 సిక్సులతో 51 బంతుల్లోనే 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిల్లర్‌కు తోడుగా చివర్లో జీటీ కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా పరుగుల వరద పారించాడు. దీంతో 87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దశ నుంచి గుజరాత్ విజయాన్ని అందుకుంది.
CSK కొంపముంచిన నోబాల్..
గుజరాత్ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సిన సమయంలో మిల్లర్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. చివరి ఓవర్‌ను జోర్దాన్ వేశాడు. ఆ ఓవర్ తొలి రెండు బంతులకు పరుగులు రాకపోవడంతో 4 బంతుల్లో 13 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మూడో బంతని లెగ్ సైడ్ మీదుగా మిల్లర్ సిక్సర్ బాదాడు. ఇక ఫుల్ టాస్‌గా వచ్చిన నాల్గో బంతిని మిల్లర్ వెనకకు కొట్టగా మొయిన్ అలీ క్యాచ్ తీసుకున్నాడు. కానీ ఆ బంతి నిబంధనలకు విరుద్ధంగా ఎత్తుగా రావడంతో అంపైర్లు నో బాల్‌గా ప్రకటించారు. దీంతో మిల్లర్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఒక వేళ ఆ బాల్ నో బాల్ కాకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. ఇక వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న మిల్లర్ ఆ తర్వాతి బంతిని ఫోర్, ఐదో బంతికి 2 పరుగులు చేసి మరో బంతి మిగిలి ఉండగానే గుజరాత్ టైటాన్స్‌ను గెలిపించాడు. మరి ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో నోబాల్ తెచ్చిన ట్విస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఉమ్రాన్ మాలిక్ విధ్వంసం.. ఐపీఎల్ హిస్టరీలో నాలుగో బౌలర్ గా!
#CSKvsGT
The ball u The reason u
know don’t Know pic.twitter.com/S6FXSO8GQm— 𝐚𝐪 (@aqqu___) April 17, 2022
No-ball or not?
📸: Disney+Hotstar pic.twitter.com/panQUv1Exf
— CricTracker (@Cricketracker) April 17, 2022
WHAT A MATCH🔥🔥🔥#GujaratTitans (170/7) beat #ChennaiSuperKings (169/5) by 3 wickets in a thriller (David Miller 94*, Rashid Khan 40)
Match highlights: https://t.co/fQ0RCPXoax pic.twitter.com/6OiHQz9oSe
— TOI Sports (@toisports) April 17, 2022
6️⃣6️⃣4️⃣6️⃣ 🔥
OMG RASHID KHAN 😮 #IPL2022 #GTvCSK
— ESPNcricinfo (@ESPNcricinfo) April 17, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.