ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడా ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఓపెనర్ పృథ్వీషా మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయినా కూడా ఢిల్లీ 149 పరుగులు మాత్రమే చేసింది. కాగా ఈ ఓటమిపై ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ చాలా సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. మ్యాచ్ అనంతరం ఢిల్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో పాంటింగ్ అగ్గిలం మీద గుగ్గిలం అయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కెప్టెన్ పంత్‌పై చాలా సీరియస్ అయినట్లు సమాచారం. ఓపెనర్ పృథ్వీషా పవర్‌ప్లేలో అదరగొట్టి.. మంచి ఆరంభాన్ని ఇచ్చిన తర్వాత.. కూడా ఢిల్లీ భారీ స్కోర్ చేయలేదు.
69 వద్ద 2వ వికెట్ కోల్పోయిన తర్వాత పంత్ బ్యాటింగ్ వచ్చాడు.. అప్పటి నుంచి చివరి వరకు పంత్ క్రీజ్‌లో ఉండి దాదాపు 36 బంతులు ఆడినా కూడా సరైన స్కోర్ చేయలేకపోయాడు. తన సహజ శైలికి భిన్నంగా చాలా నెమ్మదిగా ఆడాడు. అతనితో పాటు క్రీజ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ ఎటాకింగ్ బ్యాటింగ్ చేస్తుంటే.. అతనికి ఎక్కువ స్ట్రైక్ ఇవ్వలేదు. అలాగే ఒ మోస్తారు లక్ష్యాన్ని కాపాడుకునే సమయంలో కూడా సరైన విధంగా బౌలింగ్ మార్పులు చేయలేదు. పైగా ఎల్బీడబ్ల్యూ రివ్య్వూల విషయంలో కూడా దారుణంగా విఫలం అయ్యాడు. గుడ్డిగా డీఆర్‌ఎస్‌లు తీసుకుని రెండు రివ్వ్యూలను కూడా నష్టపోయాడు. ఇలా ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్, కెప్టెన్‌గా రెండు విధాల పంత్ వైఫల్యంపై కోచ్ పాంటింగ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. నిజానికి శ్రేయస్ అయ్యర్‌ను కాదని పంత్‌ను ఢిల్లీ అంటిపెట్టుకుని ఉన్నది.. ఎటాకింగ్ గేమ్ ఆడాతాడనే. ఆ జట్టు కోచ్ పాంటింగ్‌ది కూడా దాదాపు అలాంటి శైలే. అగ్రెసివ్ కెప్టెన్‌గా పాంటింగ్ ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు.పంత్‌లో కూడా అలాంటి లక్షణాలు చూసి.. శ్రేయస్ అయ్యర్‌ను కాదని పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి, 2022 మెగా వేలానికి ముందు భారీ ధరకు అతన్ని రిటేన్ చేసుకున్నారు. కానీ పంత్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. తన శైలికి పూర్తి భిన్నంగా ఆడుతున్నాడు. టెస్టుల్లో కూడా అగ్రెసివ్ బ్యాటింగ్ చేసే పంత్.. లక్నోతో మ్యాచ్‌లో ఎందుకు అంత నెమ్మదిగా ఆడాడు అని టీమ్ మేనేజ్‌మెంట్ తలపట్టుకున్నట్లు తెలుస్తుంది. 20 ఓవర్లలో 149 పరుగులే చేసిన ఢిల్లీ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయింది. చేతిలో వికెట్లు పెట్టుకుని పంత్ అంత నెమ్మదిగా ఆడాల్సిన అవసరం ఏంటని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్నీ ఒత్తిడి పంత్ ఆటతీరుపై ప్రభావం చూపుతోందా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ చేసిన పనికి రచ్చ! కోహ్లీ vs అయ్యర్!
A tough night for the boys yesterday, but we’re confident of bouncing back on Sunday. Read our complete match report here 👉🏼 https://t.co/T3XSNTdnp3#YehHaiNayiDilli #IPL2022 #LSGvDC
— Delhi Capitals (@DelhiCapitals) April 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.