కుల్దీప్ యాదవ్ కనీస ధర రూ.కోటి రూపాయలు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపటిల్స్ కైవసం చేసుకుంది.
అన్‌సోల్డ్ జాబితాలోకి టాప్ స్పిన్నర్స్
అన్‌సోల్డ్ జాబితాలోకి ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్, ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ జాడ్రన్, సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్,ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా. వీరిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు.
How is that for a bid? @DelhiCapitals fans are you happy to have Shardul in your team? #TATAIPLAuction @TataCompanies pic.twitter.com/SDcyitfNuq
— IndianPremierLeague (@IPL) February 12, 2022
టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను రూ.4.20 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. భువీ కోసం సూపర్ జాయింట్స్, ఎస్ఆర్‌హెచ్ పోటీ పడ్డాయి. చివరకి ఎస్ఆర్‌హెచ్ భువీను సొంతం చేసుకుంది
వేలంలో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్‌ను రూ. 7.50 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
వేలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్‌వుడ్‌ను రూ.7.75 కోట్లకు ఆర్సీబీ కైవసం చేసుకుంది. హేజల్‌వుడ్ కోసం ఆర్సీబీ, ఢిల్లీ పోటీ పడ్డాయి. చివరకి ఆర్సీబీ కొనుగోలు చేసింది
లాక్కీ ఫెర్గూసన్ ను సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాక్కీ ఫెర్గూసన్ ను రూ.10 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.
WOWZAAA – Some serious pace there @gujarat_titans #TATAIPLAuction @TataCompanies pic.twitter.com/xTknHYX8Or
— IndianPremierLeague (@IPL) February 12, 2022
రాజస్తాన్ రాయల్స్ లోకి ప్రసిధ్ కృష్ణ
ప్రసిధ్ కృష్ణ కనీస ధర రూ.కోటి రూపాయలు. రూ.10 కోట్లకు ప్రసిధ్ కృష్ణను రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.
A “royal” entry for Prasidh Krishna 😉#TATAIPLAuction @TataCompanies pic.twitter.com/ZeVZ4JN3c0
— IndianPremierLeague (@IPL) February 12, 2022
అన్‌సోల్డ్ ప్లేయర్ గా ఉమేష్ యాదవ్
దీపక్ చాహర్ కి భారీ ధర.. 14 కోట్లకు చెన్నై కైవసం
వేలంలో టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ భారీ ధర పలికాడు. సీఎస్‌కే రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా ఇప్పటి వరకు చాహర్‌దే రెండో అత్యధిక ధర కావడం విశేషం. అంతకుముందు ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ 15.25 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా గత సీజన్‌లో సీఎస్‌కేకు చాహర్ ఆడాడు.
Back where he belonged – Chahar back in yellow💛💵
Congratulations @ChennaiIPL @deepak_chahar9 #TATAIPLAuction @TataCompanies pic.twitter.com/FTxUrcID6H— IndianPremierLeague (@IPL) February 12, 2022
ఎస్‌ఆర్‌హెచ్ కు నటరాజన్
నటరాజన్ కనీస ధర రూ.కోటి రూపాయలు. నటరాజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 4 కోట్లకు కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో నటరాజన్ కోసం గుజరాత్ టైటన్స్, సన్‌రైజర్స్ పోటీ పడ్డాయి. చివరకు ఎస్ఆర్‌హెచ్ దక్కించుకుంది.
నికోలస్ పూరన్ ను సొంతం చేసుకున్న ఎస్‌ఆర్‌హెచ్
నికోలస్ పూరన్ కనీస ధర రూ.1.50 కోట్లు. రూ.10.75 కోట్లకు పూరన్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.
.@SunRisers all set for Nicky P? Good luck @nicholas_47 👍👍#TATAIPLAuction @TataCompanies pic.twitter.com/EaZunkqNY8
— IndianPremierLeague (@IPL) February 12, 2022
అన్‌సోల్డ్ ప్లేయర్ గా ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ బిల్లింగ్స్
అన్‌సోల్డ్ ప్లేయర్ గా వృద్ధిమాన్ సాహా
తగ్గిన దినేష్ కార్తీక్ ధర
దినేష్ కార్తీక్ కనీస ధర రూ.2 కోట్లు. రూ. 5.50 కోట్లకు దినేష్ కార్తీక్ ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. గత సీజన్ వరకు దినేష్ కార్తీక్ కేకేఆర్ కు ప్రాతినిధ్యం వహించాడు.
Karthik to don red and gold for @RCBTweets 👌😎#TATAIPLAuction @TataCompanies pic.twitter.com/TaVjv8j8nH
— IndianPremierLeague (@IPL) February 12, 2022
రూ. 6.75 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కు జానీ బెయిర్‌స్టో
జానీ బెయిర్‌స్టో కనీస ధర రూ.1.50 కోట్లు. రూ. 6.75 కోట్లకు బెయిర్‌స్టోను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. గత సీజన్ వరకు బెయిర్‌స్టో ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
రికార్డు ధర పలికిన ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ కనీస ధర రూ.2 కోట్లు. రూ. 15.25 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. గత సీజన్ లో కూడా ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
ISHAN KISHAN IS SOLD TO
MUMBAI INDIANS FOR A WHOPPING 15.25 CRORES!#IPLAuction #TATAIPLAuction #IPL2022 #IPL2022Auction#Mumbailndians pic.twitter.com/XmVGXRcE0O— Cricket Winner (@cricketwinner_) February 12, 2022
మరోసారి సీఎస్‌కేకు అంబటి రాయుడు
రూ. 6.75 కోట్లకు సీఎస్‌కే అంబటి రాయుడును సొంతం చేసుకుంది.
Back in Yellow @RayuduAmbati 💛💛
Congratulations @ChennaiIPL pic.twitter.com/5KjopHmK6P— IndianPremierLeague (@IPL) February 12, 2022
అన్‌సోల్డ్ ఆటగాళ్లుగా ఆఫ్గనిస్తాన్ అల్ రౌండర్ మహమ్మద్ నబీ, ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ మాథ్యూ వేడ్
మిచెల్ మార్ష్ సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
మిచెల్ మార్ష్ కనీస ధర రూ.2 కోట్లు. రూ. 6 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ మార్ష్ ను సొంతం చేసుకుంది.
Congratulations @DelhiCapitals 🥳🥳#TATAIPLAuction @TataCompanies pic.twitter.com/Gh7ygZbryO
— IndianPremierLeague (@IPL) February 12, 2022
లక్నో సూపర్‌జెయింట్స్‌కు కృనాల్ పాండ్యా
కృనల్ పాండ్యా కనీస ధర రూ.2 కోట్లు. రూ. 8.25 కోట్లకు లక్నో సూపర్‌జెయింట్స్ దక్కించుకుంది. గత సీజన్ వరకు కృనల్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
వాషింగ్టన్ సుందర్ ను సొంతం చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
రూ. 8. 75 కోట్లకు వాషింగ్టన్ సుందర్ ను సొంతం చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.
ఆర్‌సీబీకి వనిందు హసరంగ.. రూ. 10.75 కోట్లకు
శ్రీలంక అల్ రౌండర్ వనిందు హసరంగ కనీస ధర కోటి రూపాయలు. రూ. 10.75 కోట్లకు హసరంగ ఆర్సీబీ సొంతం చేసుకుంది.
Hasaranga all set to don the @RCBTweets jersey 😎👏#TATAIPLAuction @TataCompanies pic.twitter.com/B8nLmkpMzs
— IndianPremierLeague (@IPL) February 12, 2022
తిరిగి ప్రారంభమైన వేలం.. హుగ్ ఎడ్మీడ్స్ స్థానంలో చారు శర్మ
ఐపీఎల్ వేలం-2022 తిరిగి 3:30 గంటలకు ప్రారంభం కానుంది.
ఐపీఎల్ వేలంలో అపశృతి చోటుచేసుకుంది. వేలంలో పాల్గొనేందుకు వచ్చిన ఆక్షనర్ ఉన్నట్టుండి కింద పడిపోయారు. శ్రీలంక అల్ రౌండర్ వనిందు హసరంగ బిడ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుంది.
Auctioneer#IPLAuction #IPLAuction2022 pic.twitter.com/eekU4Vdqab
— Kifayat Ali (@KiffayatAli) February 12, 2022
దీపక్ హుడాను సొంతం చేసుకున్న లక్నో సూపర్‌జెయింట్స్
దీపక్ హుడా కనీస ధర రూ.75 లక్షలు. రూ. 5.75 కోట్లకు లక్నో సూపర్‌జెయింట్స్ దక్కించుకుంది.
హర్షల్ పటేల్ కు రికార్డు ధర
WELCOME BACK to @RCBTweets @HarshalPatel23 #TATAIPLAuction @TataCompanies pic.twitter.com/us5hcfWnjW
— IndianPremierLeague (@IPL) February 12, 2022
రూ. 10.75 కోట్లు పెట్టి హర్షల్ పటేల్ ను కొనుగోలు చేసిన ఆర్సీబీ
భారీ ధర పలికిన జాసన్ హోల్డర్
వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ కనీస ధర రూ.1.50 కోట్లు. రూ. 8.75 కోట్లు వెచ్చించి లక్నో సూపర్‌జెయింట్స్ దక్కించుకుంది.
Well done @LucknowIPL – @Jaseholder98 how excited are you to join the new franchise? 😃😃#TATAIPLAuction @TataCompanies pic.twitter.com/AXH1XQq9rW
— IndianPremierLeague (@IPL) February 12, 2022
అన్‌సోల్డ్ ఆటగాడిగా బంగ్లాదేశ్ అల్ రౌండర్ షకిబుల్ హసన్
నితీష్ రాణాను సొతం చేసుకున్న కేకేఆర్
టీమిండియా అన్‌క్యాప్‌డ్ ఆటగాడు నితీష్ రాణాను మరోసారి కేకేఆర్ సొంతం చేసుకుంది. రూ. 8 కోట్లకు రాణాను సొంతం చేసుకోవడం విశేషం.
మళ్లీ సీఎస్‌కే గూటికి డ్వేన్ బ్రావో
డ్వేన్ బ్రావో కనీస ధర రూ. 2 కోట్లు. రూ. 4.4 కోట్లతో డ్వేన్ బ్రావోను సీఎస్‌కే కొనుగోలు చేసింది.
అన్‌సోల్డ్ ఆటగాళ్లుగా సురేశ్ రైనా, స్టీవ్ స్మిత్, డేవిడ్ మిల్లర్
టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనాతో పాటు.. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా ఆటగాడు మిల్లర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనడానికి ఆసక్తి చూపలేదు. యాక్సిలరేటెడ్ లిస్ట్‌లో ఈ ముగ్గురు మరోసారి వేలంలోకి రానున్నారు.
Confirmed!!
IPL is more about money than talent.
These superstars went unsold in #IPL2022Auction is really really shame. @daniel86cricket @cricketwallah #IPLAuction2022 #IPLMegaAuction2022 pic.twitter.com/FND3mi8JZv— Umar Bhat (@BhatUmar01) February 12, 2022
రాజస్తాన్ రాయల్స్‌కు దేవదూత్ పడిక్కల్
టీమిండియా యువ ఆటగాడు దేవదూత్ పడిక్కల్‌కు మెగావేలంలో భారీ ధర పలికింది. పడిక్కల్ కనీస ధర రూ. 2 కోట్లు. 7.75 కోట్లు వెచ్చించి రాజస్తాన్ రాయల్స్ పడిక్కల్‌ను కొనుగోలు చేసింది. గత సీజన్‌లో ఆర్‌సీబీ రూ. 20 లక్షలకు పడిక్కల్ ను దక్కించుకుంది.
సురేష్ రైనా పై ఆసక్తి చూపని ప్రాంచైజీలు
సురేష్ రైనా కనీస ధర రూ. 2 కోట్లు
వేలంలో అమ్ముడుపోని డేవిడ్ మిల్లర్
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ కు వేలంలో నిరాశ
ఇంగ్లండ్ ఆటగాడు జేసన్ రాయ్‌ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్
రాబిన్ ఊతప్పను కనీస ధర రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన సీఎస్‌కే
రాజస్తాన్ రాయల్స్‌కు షిమ్రోన్ హెట్‌మైర్
వెస్టిండీస్ హిట్టర్ షిమ్రోన్ హెట్‌మైర్‌కు వేలంలో మంచి ధరే దక్కింది. కనీస ధర రూ. 1.50 కోట్లు కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ పోటీపడ్డాయి. చివరకు రాజస్తాన్ రాయల్స్ రూ. 8.25 కోట్లకు హెట్‌మైర్‌ను దక్కించుకుంది.
లక్నో సూపర్‌జెయింట్స్‌కు మనీష్ పాండే
మనీష్ పాండే కోటి రూపాయలు. లక్నో సూపర్ జెయింట్స్ రూ. 4.6 కోట్లకు కొనుగోలు చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ రూ. 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 2 కోట్లు. అయితే వార్నర్ ఇంత తక్కువ ధరకు అమ్ముడుపోతాడని ఎవరు ఊహించలేదు. 2016 ఎస్‌ఆర్‌హెచ్‌ను చాంపియన్స్‌గా నిలిపిన వార్నర్‌ను ఎస్‌ఆర్‌హెచ్ అవమానకరరీతిలో రిలీజ్ చేసింది. వేలంలో మంచి ధర దక్కుతుంది అని భావించిన ఫ్యాన్స్‌కు ఇది నిరాశే అని చెప్పొచ్చు.
.@davidwarner31 was the last player in the Marquee Players’ List. 👌 👌
… and @DelhiCapitals have him on board for INR 6.25 Crore. 👏 👏#TATAIPLAuction @TataCompanies pic.twitter.com/qBGqtXwmC9
— IndianPremierLeague (@IPL) February 12, 2022
రూ.6.75 కోట్లకు లక్నో సూపర్‌జెయింట్స్ కి క్వింటన్ డికాక్
గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన క్వింటన్ డికాక్ కనీస ధర రూ. 2 కోట్లు. లక్నో సూపర్‌జెయింట్స్ రూ. 6.75 కోట్లకు డికాక్‌కు కొనుగోలు చేసింది.
@QuinnyDeKock69 will now ply his trade for @LucknowIPL. 👍 👍
He earns INR 6. 75 Crore. 👌 👌#TATAIPLAuction @TataCompanies pic.twitter.com/P1aQD2hr7A
— IndianPremierLeague (@IPL) February 12, 2022
రూ. 7 కోట్లకు ఆర్‌సీబీకి డుప్లెసిస్
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఫాప్ డుప్లెసిస్‌ను ఆర్‌సీబీ రూ. 7 కోట్లకు దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 2 కోట్లు . గత సీజన్ వరకు డుప్లెసిస్ సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహించాడు.
గుజరాత్ టైటాన్స్‌కు మహ్మద్ షమీ
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కనీస ధర రూ. 2 కోట్లు. గత సీజన్‌లో షమీ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. షమీని ఈసారి వేలంలో రూ. 6.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వేలంలోకి వచ్చాడు. గతేడాది వరకు రూ. 7కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన అయ్యర్ కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది. ముందు నుంచి అయ్యర్‌పై మంచి అంచనాలు ఉండడంతో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తో పోటీపడిన కేకేఆర్ చివరకు అయ్యర్‌ను రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది.
ట్రెంట్ బౌల్ట్‌ను దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్
న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కనీస ధర రూ. 2 కోట్లు. బౌల్ట్‌ను దక్కించుకోవడం కోసం రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి రాజస్తాన్ రాయల్స్ రూ. 8 కోట్లకు బౌల్ట్‌ను దక్కించుకుంది.
రూ.9.25 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కు కగిసో రబాడ
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా కనీస ధర రూ. 2 కోట్లు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. అతని కోసం గుజరాత్ టైటాన్స్ గట్టిపోటి ఇచ్చినప్పటికి.. చివరికి పంజాబ్ కింగ్స్ రూ. 9.25 కోట్లతో రబాడను దక్కించుకుంది.
తగ్గిన పాట్ కమిన్స్ ధర.. మళ్లీ కేకేఆర్‌కే
మూడో ఆటగాడిగాఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్. కమిన్స్ కనీస ధర రూ. 2 కోట్లు. గతేడాది వేలంలో కేకేఆర్(రూ.15.50 కోట్లు) అత్యధిక ధరకు అమ్ముడైన పాట్ కమిన్స్.. ఈసారి మాత్రం సగానికి పడిపోయాడు. రూ. 7.25 కోట్లతో కమిన్స్‌ను మళ్లీ కేకేఆర్ కొనుగోలు చేసింది.
రూ. 5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్‌కు రవిచంద్రన్ అశ్విన్
వేలంలో రెండో ఆటగాడిగా టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. అశ్విన్ కనీస ధర రూ.2 కోట్లు. వేలంలో అశ్విన్‌ను రాజస్తాన్ రాయల్స్ రూ.5 కోట్లకు దక్కించుకుంది.
పంజాబ్ కింగ్స్‌కు శిఖర్ ధావన్
ఐపీఎల్ మెగావేలం తొలి ఆటగాడిగా శిఖర్ ధావన్. అతని కోసం పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య భారీ పోటీ నెలకొంది. ధావన్ కనీస ధర. రూ.2 కోట్లు. రూ.8.25 కోట్లతో శిఖర్ ధావన్ పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
8 ఫ్రాంఛైజీల దగ్గర మిగిలిన మొత్తం:
ఢిల్లీ క్యాపిటల్స్- 47.5 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్- 48 కోట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 57 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్- 48 కోట్లు
ముంబై ఇండియన్స్- 48 కోట్లు
పంజాబ్ కింగ్స్- 72 కోట్లు
రాజస్తాన్ రాయల్స్- 62 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్- 68 కోట్లు
మెగా వేలం ఆరంభం :
ఆటగాళ్లను దక్కించుకునే క్రమంలో ఫ్రాంఛైజీలు ఐపీఎల్ మెగా వేలం-2022కు సిద్ధమయ్యాయి. బెంగళూరు వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌లో చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పంజాబ్, రాజస్తాన్ సహా కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ వేలంలో పోటీ పడనున్నాయి.