దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్, రాజీవ్ గాందీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుండటంతో టికెట్లకు తీవ్ర పోటీ నెలకొంది. ఈ నెల 25న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడవ టీ20 మ్యాచ్ ఆన్ లైన్ టికెట్లు ఇప్పటికే అన్నీ అమ్ముడయిపోయాయి. గురువారం రాత్రి 8 గంటలకు పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్ యాప్‌లో ఈ మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉంచగా.. క్షణాల్లో 39 వేల టికెట్లు అమ్ముడయిపోయాయి. మరోవైపు.. ఆఫ్ లైన్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు ఆందోళనకు దిగారు. ఆ వివరాలు..
ఉప్పల్ స్టేడియం కెపాసిటీ.. 55,000. ఇందులో 39,000 టిక్కెట్లు ఆన్ లైన్ లో విక్రయానికి పెట్టగా, మిగిలిన 16,000 టిక్కెట్లను ఆఫ్ లైన్ లో విక్రయాయించాల్సి ఉంది. ఈ మేరకు, ఈనెల 15 నుంచి టికెట్లు విక్రయిస్తామని HCA ముందుగా ప్రకటించింది. అయితే.. చెప్పినట్టుగా అందుబాటులో ఉంచలేదు. ఈ క్రమంలో ఆఫ్లైన్ టికెట్ల కోసం జింఖానాకు చేరుకున్న వారికి నిరాశ ఎదురవడంతో ఆందోళనకు దిగారు. HCA పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నినాదాలు చేస్తున్నారు. మరోవైపు కాంప్లిమెంటరీ పాసుల కోసం అటు పోలీసులు.. ఇటు మంత్రులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధికారులను ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు మూడు టీ20లు ఆడాల్సి ఉంది.
ఇండియా vs ఆస్ట్రేలియా (టీ20 సిరీస్ షెడ్యూల్)
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, ఉమేష్ యాదవ్.
ఈ మ్యాచులన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.