విరాట్ కోహ్లీ అంటే ఒక క్రికెటర్ గానే కాకుండా.. వ్యక్తిగానూ అతనికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మైదానంలో విరాట్ కోహ్లీ ఆడే తీరు, ప్రవర్తన అభిమానులను కేరింతలు కొట్టేలా చేస్తుంది. అలాంటి విరాట్ కోహ్లీ కెరీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కాంపిటేటివ్ క్రికెట్ ఇదే చివరి నెల అన్నట్లు చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ అలియాస్ రన్ మెషిన్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఈ పేరు గురించి ఎలాంటి ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రపంచ క్రికెట్ లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. కోహ్లీ తప్ప ఈ రికార్డు మరొకరికి సాధ్యం కాదేమో అనుకునే ఎన్నో రికార్డులను సృష్టించాడు. కెరీర్ లో ఎంతో సాధించిన విరాట్ కోహ్లీ తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ చేసిన ఇంటర్వ్యూలో మాత్రం కెరీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కాంపిటేటివ్ క్రికెట్ లో ఇదే తనకు చివరి నెల అనుకుని ఆడానంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కెరీర్ లో విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో ఎంతో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నాడు. టీమిండియా మాజీల నుంచి సైతం విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ, గతేడాది టీ20ల్లో ఆఫ్గనిస్తాన్ పై కేవలం 61 బంతుల్లోనే 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ వెనక్కి తిరిగి చూసింది. లేదు. ఐపీఎల్ ట్రోఫీ అందించలేకపోయాడు అనే ఒక్క అసంతృప్తి తప్ప.. ఐపీఎల్లో కోహ్లీ ప్రదర్శన మాత్రం అద్భుతమనే చెప్పాలి. తాజా సీజన్ లో కూడా ఆడిన నాలుగు మ్యాచుల్లో 3 అర్ధశతకాలు నమోదు చేశాడు. అయితే విరాట్ కోహ్లీ కెరీర్ గురించి అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే కోహ్లీ చెప్పుకొచ్చింది.. ఇప్పటి పరిస్థితి గురించి కాదు. తాను ఫామ్ లో లేని సమయంలో ఎంతటి మానసిక క్షోభ అనుభవించాడో చెప్పుకొచ్చాడు. “నేను ఫామ్ లో లేని సమయంలో ఎంతో మనో వేదన అనుభవించాను. విరాట్ కోహ్లీ అంటే ఇలాగే ఉండాలి అని అభిమానులు పెట్టుకున్న అంచనాలు అందుకోలేక ప్రశాంతతను కోల్పోయాను. నేను ఎప్పుడూ నాలాగే ఉంటాను. కానీ, ఆ సమయంలో మాత్రం మానసికంగా ఎంతో ఇబ్బంది పడ్డాను. ఇలా ఉంటే నేను నా జట్టుకు, నా ఆటకు న్యాయం చేయలేను అని అర్థం చేసుకున్నాను. ఇంకొకరిలా నటించడం మానేసి.. నాకులా ఉన్నాను. అన్ని భయాలను పక్క పెట్టేశాను.
He was ready to give up on everything after asia cup. The mere thought of it breaks my heart. A lot could have happened but Virat’s 71st turned his fate around. This makes 71st so much more special ❤️.
Please don’t give up ever @imVkohli pic.twitter.com/84bmYgtJC3— Yashvi. (@BreatheKohli) April 17, 2023
గతేడాది జరిగిన ఆసియా కప్పు మసయంలో.. మైదానంలోకి అడుగుపెట్టే ప్రతిసారి ఇదే కాంపిటేటివ్ క్రికెట్ లో నాకు చివరి నెల అనుకుని ఆడటం మొదలు పెట్టాను. ఒకవేళ అదే నిజమైతే.. భగవంతుడు నన్ను, నా కెరీర్ ని అలాంటి పరిస్థితుల్లో ఉంచినా నాకు ఓకే అనుకున్నాను. నా భయాలను పక్కన పెట్టేశాను. ప్రతి సిచ్యువేషన్ ని ఆశ్వాదించడం ప్రారంభించాను. ఆ విధంగానే నేను మళ్లీ నా కెరీర్ లో మునుపటి స్థాయికి చేరుకున్నాను” అంటూ విరాట్ కోహ్లీ తన కెరీర్ లో ఫామ్ లేమి, విమర్శలు ఎదుర్కొన్న కాలాన్ని ఎలా అధిగమించాడో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో మాత్రమే కాదు.. జీవితంలో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న ఎందరిలోనే మనో నిబ్బరాన్ని నింపుతున్నాయి.
“I was willing to accept that when I go back and play, it might be the last month of me playing competitive cricket.”
“I stepped away from pretending. I let go of my insecurities.”
Wish we could give you the tightest hug @imVkohli! You’re a champion, we love you 🧿♥️ pic.twitter.com/kQD2D72Twe
— Alaska (@Aaaaaaftab) April 17, 2023