టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియా న్యూజీలాండ్ జట్లు తలపడబోతున్న విషయం తెలిసిందే. కాగా.. టైటిల్ రేసులో రెండూ కూడా బలమైన జట్లు పోటీపడుతుండటంతో ఈసారి కప్ ఎవరు గెలుస్తారోనని కాస్త ఆసక్తిగా మారింది. ఇక ఇదిలా ఉంటే ఇటీవల రెండో సెమీ ఫైనల్ లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.
ఈ ఓటమితో నిరాశలో ఉన్న పాక్ జట్టుకు కొందరు మాజీ ఆటగాళ్లు అండగా నిలుస్తూ మద్దతు తెలుపటంతో పాటు ఓటమిపై జరిగిన తప్పిదాలను ఎత్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది పాక్ ఓటమిపై తనదైన శైలీలో స్పందించాడు. క్రీజులో ఉన్న మథ్యూ వేడ్ కి షాహిన్ షా వేసిన బౌలింగ్ తీరుపై కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని కానీ కొంచెం తెలివిగా బుర్ర ఉపయోగించి బౌలింగ్ చేసి ఉంటే నేడు ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీలో షాహిన్ షా ఫర్ఫార్మెన్స్ బాగుందని తెలిపాడు.
దీంతో పాటు ఇతను మంచి నైపుణ్యం కలిగిన ఆటగాడని ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్ లో మంచి ఆటతీరును కనబరచాలని షాహిద్ ఆఫ్రిది కోరాడు. ఇక ఇదే కాకుండా హసన్ ఆలీ నుంచి క్యాచ్ చేజారినంత మాత్రాన పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదంటూ కూడా షాహిద్ ఆఫ్రిది తెలిపాడు. ఇక ఈయనతో పాటు పాక్ మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్-హక్ సైతం స్పందిస్తూ.. తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని, గెలుపును స్వీకరించినట్లై ఓటమిని కూడా స్వీకరిస్తామంటూ ఇంజమామ్ ఉల్-హక్ పాక్ జట్టుకు భరోసానిచ్చాడు. కానీ.., ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే షాహీన్ అఫ్రీది.. సీనియర్ అఫ్రీదికి కాబోయే అల్లుడు. మరి.. తన కూతురికి కాబోయే భర్తపై షాహీద్ అఫ్రీది ఇలాంటి కామెంట్స్ చేయడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.