నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. సాంకేతిక కారణాల వల్ల తరచుగా ప్రమాదాలు జరగడంతో.. నిర్వాహకులు రేస్‌ను అర్ధాంతరంగా నిలిపేశారు. శనివారం రేసులు సజావుగానే జరగినా.. ఆదివారం వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో రేసుని పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయారు. క్వాలిఫయింగ్ రేసులో కొత్త ట్రాక్ పై పలుమార్లు కార్లు ఢీకొని రేసర్లకు గాయాలయ్యాయి. కొత్త ట్రాక్ పై అలవాటు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ ఈవెంట్‌కు రెండు రోజులు మాత్రమే ప్రభుత్వం అనుమతివ్వడంతో.. సోమవారం నిర్వాహిద్దామని అనుకున్నా ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో.. ఫైనల్ రేస్ చూద్దామని వచ్చిన ప్రేక్షకులు, క్రీడాభిమానులు మధ్యలోనే వెనుదిరిగారు. అంతేకాదు వీఐపీ టికెట్ తీసుకున్నా పలువురు ఫ్యాన్స్‌ను పోలీసులు లోపలికి అనుమతించలేదు. రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు ధర పెట్టి టికెట్లు కొంటే లోపలికి పంపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీ గ్యాలరీలో టికెట్ తీసుకున్న వారు కాకుండా.. ఇతర వీఐపీలు, పోలీసుల కుటుంబ సభ్యులతో గ్యాలరీ నిండిపోయింది. ఓవర్ లోడ్ కారణంగా లోపలికి అనుమతించడంలేదని పోలీసులు చెప్పారు. దీంతో పలువురు అభిమానులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.
Telangana minister KTR flagged off the inaugural edition of the Indian Racing League at Hyderabad.pic.twitter.com/MDXSpMTPUN
— Indian Tech & Infra (@IndianTechGuide) November 19, 2022
కాగా, ఈ పోటీలను రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. అంతర్జాతీయ ఆటోమొబైల్ ఫెడరేషన్ సహకారంతో దేశంలోనే తొలిసారిగా ఈ ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్)ను నిర్వహిస్తోంది. ఐఆర్‌ఎల్ పోటీలు ఫార్ములా రేసింగ్‌లోని ఎఫ్-3 స్థాయివి. ఇందులో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ సహా ఆరు జట్లు తలపడుతున్నాయి. ఒక్కో జట్టు తరఫున ముగ్గురు పురుష, ఒక మహిళా డ్రైవర్ పోటీ పడనున్నారు. మొత్తం ఆరు జట్ల నుంచి 12 కార్లు, 24 మంది డ్రైవర్లు బరిలో ఉంటారు. హైదరాబాద్ టీమ్ నుంచి నగరానికి చెందిన ప్రముఖ ఫార్ములా డ్రైవర్ కొండా అనిందిత్ రెడ్డి బరిలో ఉన్నాడు. ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా- ఈ పోటీలకు ఇవి ట్రయల్ రన్ లు మాత్రమే.
On the second day of trial of the #IndianRacingLeague at NTR Marg, near Tank Bund in Hyderabad, minor accidents reported today, three vehicles collided, but no injuries.#Hyderabad #FormulaERace #RacingHyderabad #IRL #HyderabadStreetCircuit #FormulaE pic.twitter.com/vjE8TrEuy5
— Surya Reddy (@jsuryareddy) November 20, 2022