క్రీడల్లో గాయలు సర్వసాధారణమే. క్రికెట్ అనే కాదు ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ ఇలా ఏ గేమ్‌ను చూసుకున్నా ఇంజ్యురీస్ కామన్‌గా మారిపోయాయి. అయితే కీలకమైన టోర్నీల సమయంలో ప్లేయర్లు గాయపడితే అవి జట్ల విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడో క్రికెటర్ ఇలాగే గాయం కారణంగా ఐపీఎల్ 2023కి పూర్తిగా దూరం అయ్యాడు.
ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్ 2023 దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు ఈ సీజన్ మొత్తానికి దూరంగా ఉండనున్నాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో గాయపడిన ప్రసిద్ధ్ కృష్ణ.. వారం రోజుల కిందటే వెన్నెముకకు సర్జరీ చేయించుకున్నాడు. న్యూజిలాండ్ – ఏ టీమ్‌తో అనధికార టెస్టు సిరీస్ జరిగిన సమయంలో అతడు గాయపడ్డాడు. దీంతో ఆ సిరీస్‌లో ప్రసిద్ధ్ ప్లేసులో శార్దూల్ ఠాకూర్‌ను బీసీసీఐ ఆడించింది.
గత సీజన్లో అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్స్‌కు చేరుకున్న రాజస్థాన్ రాయల్స్.. ఆఖరి ఆటలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. మంచి పేస్‌తో వికెట్లు తీసే ప్రసిద్ధ్ కృష్ణ లేని లోటు రాయల్స్ బౌలింగ్ అటాక్‌లో కనిపించే అవకాశం ఉంది. ఇక, టీమిండియా తరఫున అరంగేట్రం చేసినప్పటి నుంచి మంచి పెర్ఫామెన్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ. ఇండియా టీమ్ తరఫున 14 వన్డేలు ఆడిన అతడు.. 5.32 ఎకానమీతో 25 వికెట్లు తీసి తానేంటో నిరూపించుకున్నాడు.
భారత జట్టు తరఫున ఆడినప్పుడు ప్రసిద్ధ్ చూపిన పెర్ఫామెన్స్ గతేడాది వేలంలో అతడికి బంపర్ ఆఫర్ దక్కేలా చేసింది. 2022 ఐపీఎల్ మినీ వేలంలో రూ.10 కోట్లు పెట్టి అతడ్ని దక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్. కాగా, ప్రసిద్ధ్ కృష్ణ గాయం నుంచి కోలుకునేందుకు 6 నుంచి 8 నెలల వరకూ సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. రాయల్స్ జట్టు తరఫున గత సీజన్లో 19 వికెట్లు పడగొట్టాడు ప్రసిద్ధ్. టీమ్ ఫైనల్ చేరడంలో అతడి పాత్ర కూడా ఎంతో ఉంది. అలాంటి ఫాస్ట్ బౌలర్ ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరం కానుండటం రాయల్స్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని చెప్పొచ్చు. అయితే రాజస్థాన్ బౌలింగ్ దళంలో నవ్‌దీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, ఓబెడ్, మెక్కాయ్ లాంటి స్పీడ్స్టర్లు ఉండటం గమనార్హం. వీళ్లు బౌలింగ్‌లో ఎలా రాణిస్తారనే దాన్ని బట్టే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
Prasidh Krishna has been ruled out of Rajasthan Royals’ 2023 season due to a lumbar stress fracture, for which he needs surgery #IPL2023 pic.twitter.com/4WzzbIhOG5
— ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2023