సన్ రైజర్స్ అభిమానులకి శుభవార్త. ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ మేజర్ అమెరికా క్రికెట్ లీగ్ లో అదరగొడుతున్నాడు. ఈ లీగ్ లో సీయాటెల్ ఓర్కాస్ జట్టుకు తరపున ఆడుతున్న హెన్రీచ్ క్లాసెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఎంఐ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఐపీఎల్ 2023 లో సన్ రైజర్స్ అభిమానులకి కాస్త ఊరట కలిగించిన విషయం ఏమైనా ఉందంటే అది హెన్రీచ్ క్లాసెన్ బ్యాటింగ్ మాత్రమే. స్టార్ కాస్టింగ్ తో నిండిపోయిన హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో అంచనాలను అందుకోలేక చతికిలపడింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. కానీ క్లాసెన్ ఒక్కడే వీర విహారం చేసాడు. తనపై పెట్టుకున్న నమ్మకానికి పూర్తిగా న్యాయం చేసాడు. భవిష్యత్తులో హైదరాబాద్ జట్టుకి ఒక భరోసా ఇచ్చాడు. అయితే క్లాసెన్ విధ్వంసం ఐపీఎల్ తోనే ఆగిపోలేదు. లీగ్ ఎక్కడున్నా ఈ దక్షిణాఫ్రికా ఆటగాడి విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తాజాగా అమెరికా మేజర్ లీగ్ లో హెన్రీచ్ క్లాసెన్ సంచలన ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. తాజాగా నిన్న మ్యాచులో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
సన్ రైజర్స్ అభిమానులకి శుభవార్త. ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ మేజర్ అమెరికా క్రికెట్ లీగ్ లో అదరగొడుతున్నాడు. ఈ లీగ్ లో సీయాటెల్ ఓర్కాస్ జట్టుకు తరపున ఆడుతున్న హెన్రీచ్ క్లాసెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఎంఐ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 44 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 110 పరుగులు చేసి జట్టుకి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఈ సెంచరీతో 44 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా హెన్రీచ్ క్లాసెన్ చరిత్ర సృష్టించాడు. ఇక ఎంఐ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్ లోనైతే ఒక్క ఓవర్లోనే 26 పరుగులు చేసి వావ్ అనిపించాడు. క్లాసెన్ విధ్వంసంతో భారీ టార్గెట్ ని కూడా సీయాటెల్ టీమ్ ఛేజ్ చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 194 పరుగులు చేసింది. నికోలస్ పూరణ్మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 34 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 68 పరుగులు చేసాడు. కెప్టెన్ కీరన్ పొలార్డ్(18 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సియాటెల్ బౌలర్లలో ఇమాద్ వసీం, హర్మీత్ సింగ్ రెండేసి వికెట్లు కొట్టగా.. కామెరూన్ గాన్నన్, ఆండ్రూ టై తలో వికెట్ తీసారు. అనంతరం సియాటెల్ ఓస్కార్స్ 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 195 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్ సెంచరీకి తోడుగా నౌమన్ అన్వర్(30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించారు. ఎంఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(4/31) నాలుగు వికెట్లతో రాణించినా ఫలితం లేకపోయింది. రషీద్ ఖాన్(2/41) రెండు వికెట్లు తీయగా.. డేవిడ్ వైస్, కెంజిగే తలో వికెట్ తీసారు. మొత్తానికి క్లాసెన్ ఆడిన ఇన్నింగ్స్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Heinrich Klaasen, you beauty!
MLC’s first ever centurion 💯 leads the Seattle Orcas to a record chase AND to the 🔝 of the table!#MLC2023 pic.twitter.com/RHDqO4jSqo
— Major League Cricket (@MLCricket) July 26, 2023