శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల అతిస్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే.. వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్న గిల్.. టీ20ల్లో తన సత్తా చూపేందుకు బరిలోకి దిగి ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు. 5 బంతుల్లో ఒక ఫోర్‌తో 7 రన్స్ చేసిన గిల్.. థీక్షణ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ సైతం 7 పరుగులు మాత్రమే చేసి త్వరాగానే అవుట్ అయ్యాడు.
దీంతో టీమిండియా 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. తర్వాత సంజు శాంసన్ సైతం 5 పరుగులు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి ఇషాన్ కిషన్ కొద్దిసేపు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 37 పరుగులు చేసిన ఇషాన్.. హసరంగా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే 29 రన్స్ చేసిన పాండ్యా కూడా అవుట్ అవ్వడంతో భారత్ 14.1 ఓవర్లలో 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఇక్కడి నుంచి దీపక్ హుడా, అక్షర్ పటేల్ సంచలన బ్యాటింగ్ చేశారు. మరో వికెట్ పడకుండా.. భారత్‌కు 162 పరుగుల స్కోర్ అందించారు. హుడా 41, అక్షర్ 31 పరుగులతో ఇండియాకు మంచి స్కోర్ అందించారు.
అయితే.. శ్రీలంక సైతం 163 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా గట్టి జవాబే ఇచ్చింది. 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే.. ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావీ సూపర్ బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. కానీ.. నిజానికి ఈ మ్యాచ్‌లో శ్రీలంక మంచి పోరాటం చూపించింది. అయితే.. భారత్ మ్యాచ్ గెలిచినప్పటికీ ఒక బౌలర్‌పై మాత్రం క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఏం రాణిస్తున్నాడని ఈ బౌలర్ అవకాశాలపై అవకాశాలు ఇస్తున్నారంటూ.. మండిపడుతున్నారు. అతనే పేసర్ హర్షల్ పటేల్. భారత జట్టులో చాలా రోజుల నుంచి ఆడుతున్న హర్షల్ పటేల్ పెద్దగా రాణించనా దఖలా లేదు. పైగా.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసినా.. 4 ఓవర్లకు 10.20 ఎకానమీతో 41 పరుగులు సమర్పించుకున్నాడు.
కుర్రాళ్లు శివమ్ మావీ 5.50, ఉమ్రాన్ మాలిక్ 6.80 మంచి ఎకానమీతో బౌలింగ్ వేసిన చోట హర్షల్ పటేల్ పరుగులు సమర్పించుకున్నాడు. వీటికి తోడు నో బాల్స్‌తో కూడా రోత పుట్టించాడు. టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు కూడా హర్షల్ పటేల్ కూడా.. చాలా అవకాశాలు సమర్పించారు. కానీ.. తీరా వరల్డ్ కప్‌కు ముందు గాయంతో దూరం అయ్యాడు. మళ్లీ ఇప్పుడు ఏకంగా అర్షదీప్ సింగ్‌ను పక్కన పెట్టి మరీ హర్షల్ పటేల్‌ను ఆడిస్తూ.. నెత్తిన పెట్టుకుంటున్నారు. హర్షల్ పటేల్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్లు చూపిస్తున్న ఈ ఉదాసీనతపై క్రికెట్ అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హర్షల్ టీమ్‌లో ఎందుకు ఉంటున్నాడో తమకు అర్థం కావడం లేదంటూ పేర్కొంటున్నారు. మరి హర్షల్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Harshal Patel conceded 2-41 against Sri Lanka on Tuesday. Five times in his last 12 T20Is, he has given more than 10 runs an over.
Overall, he averages 39.54 with an economy rate of 10.19 in this period.
What is going wrong for the bowler? pic.twitter.com/eduVkdamj8
— Dainik Cricket (@Dainikcricket) January 4, 2023