ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ పాకిస్థాన్‌పై తన పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు. రావాల్పిండి, ముల్తాన్ వేదికల్లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో చెలరేగిన బ్రూక్.. మూడు టెస్టులోనూ సెంచరీ చేసి కొత్త చరిత్ర సృష్టించాడు. పట్టుమని నాలుగు టెస్టుల అనుభవం కూడా లేని ఈ ఇంగ్లీష్ క్రికెటర్ ఏకంగా 125 ఏళ్ల క్రితం.. భారత్‌కు చెందిన రంజీత్ సిన్హ్ జీ ఇంగ్లండ్ తరఫున ఆడుతూ.. నెలకొల్పిన ప్రపంచ రికార్డును పాకిస్థాన్‌తో మూడో టెస్టు సందర్భంగా బ్రూక్ బద్దలు కొట్టాడు. రంజిత్ సిన్హా జీ తొలి ఆరు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో.. చేసిన 418 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. రంజిత్ సిన్హా జీ.. తన తొలి ఆర టెస్టు ఇన్నింగ్స్‌ల్లో.. 62, 154, 8, 11, 175, 8 పరుగులు చేసి.. వరల్డ్ రికార్డు నమోదు చేశారు. ఇప్పుడు ఆ రికార్డును బ్రూక్.. 12, 153, 87, 9, 108, 111.. రన్స్ చేసి బ్రేక్ చేశాడు.
అయితే.. తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు చేయడం కూడా విశేషం. పైగా ఈ మూడు సెంచరీలు పాకిస్థాన్‌పైనే సాధించాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టుతో సాంప్రదాయ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన బ్రూక్.. ఆ మ్యాచ్‌లో 12 పరుగులు చేశాడు. అయితే.. దాదాపు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. తొలి రెండు టెస్టులను గెలిచి.. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది. ఈ జట్టులో బ్రూక్ సైతం ఉన్నాడు. రావాల్పిండిలో జరిగిన తొలి టెస్టు, తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులతో చెలరేగిన బ్రూక్.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం 87 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
ముల్తాన్‌లో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులతో నిరాశ పర్చిన బ్రూక్.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ టీమ్ మొత్తం విఫలమైనా.. ఒక్కడే ఒంటరి పోరాటం చేసి.. 108 పరుగులతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. ఇక శనివారం కరాచీ వేదికగా మొదలైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ బ్రూక్ సెంచరీతో కదంతొక్కాడు. 111 పరుగులతో కేవలం ఆరు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 3వ సెంచరీతోని నమోదు చేశాడు. బ్రూక్ ఆడిన ఆరు టెస్టు ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. టెస్టుల్లో అతని యావరేజ్ 80 పై మాటే. పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టు బ్రూక్‌కు నాలుగో టెస్టు మాత్రమే. మరి రెండో ఇన్నింగ్స్‌లోనూ మరిన్ని పరుగులు చేసి.. తన రికార్డును మరింత పటిష్టం చేసుకోవాలని బ్రూక్ పట్టుదలతో ఉన్నాడు. మరి బ్రూక్ బద్దలు కొట్టిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Harry Brook = run machine 💯#PAKvENGpic.twitter.com/x4G4TnRk2G
— The Cricketer (@TheCricketerMag) December 18, 2022