హార్థిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా రెండు టీ20ల సిరీస్‌లో ఐర్లాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన రెండు టీ20లో భారత్ 4 పరుగుల తేడా థ్రిల్లింగ్ విక్టరీ సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు ముందు టాస్ సందర్భంగా జట్టులో మార్పులు చేర్పుల గురించి కెప్టెన్ హార్థిక్ పాండ్యా చెబుతూ.. తొలి మ్యాచ్‌లో ఆడిన రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో అతని స్థానంలో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాడు.
పాండ్యా.. సంజూ పేరు చెప్పగానే స్టేడియంలోని ప్రేక్షకలు హర్షధ్వానాలతో సంజూకు మద్దతు తెలిపారు. సంజూకు అక్కడున్న క్రేజ్‌కు కెప్టెన్ పాండ్యా కూడా అవాక్కైయ్యాడు. సంజూను వీళ్లు చాలా ఇష్టపడుతున్నారంటూ చెప్పాడు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఇండియన్ సపోర్టర్లు.. సంజూ శాంసన్ ఆడుతున్నాడనే విషయం తెలియగానే సంతోషంతో గట్టిగా అరిచారు. వారి దెబ్బకు ఐర్లాండ్ స్టేడియం దద్దరిల్లింది. సంజూ క్రేజ్ ఈ రేంజ్‌లో ఉంటుందా అంటూ ఫ్యాన్స్ రచ్చ చేసిన వీడియో చూసిన వారు అనుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అలాగే తన ఆట చూడాలనుకున్న ఫ్యాన్స్‌ను సంజూ శాంసన్ ఏమాత్రం నిరాశ పర్చలేదు. ఓపెనర్‌గా వచ్చిన సంజూ ఫోర్లు సిక్సర్లతో దుమ్ములేపాడు. సూపర్ స్టన్నింగ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. తనకు ఎందుకంత క్రేజ్ అనే విషయాన్ని తన బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగులు చేసింది. దీపక్ హుడా(57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104) సెంచరీతో కదంతొక్కగా.. సంజూ శాంసన్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ మూడు వికెట్లు తీయగా.. జోష్ లిటిల్, క్రైగ్ యంగ్ రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్(18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), ఆండీ బాల్‌బిర్నీ(37 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 60)టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ ఇద్దరికి తోడు హరీ టెక్టర్(28 బంతుల్లో 5 ఫోర్లతో 39), జార్జ్ డాక్‌రెల్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీశారు. చివరి ఓవర్‌లో ఐర్లాండ్ విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి. అయితే అప్పటి వరకు ఐర్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తే.. ఈ రన్స్ పెద్ద కష్టంగా అనిపించలేదు.
దానికి తోడు ఉమ్రాన్ మాలిక్ రెండో బంతి నోబాల్‌గా వేయడంతో ఎక్స్‌ట్రా డెలివరీతో పాటు ఫ్రీహిట్ లభించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఐరీష్ బ్యాటర్లు వరుసగా రెండు బౌండరీలు బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేసేలా కనిపించారు. కానీ తర్వాతి మూడు బంతులను ఉమ్రాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా బౌలింగ్ చేయడంతో పాటు బౌండరీలు బాదకుండా కచ్చితమైన యార్కర్లు సంధించాడు. దాంతో చివరి మూడు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే వచ్చి భారత్‌కు విజయాన్ని అందించాడు. మరి ఈ సంజూ శాంసన్ క్రేజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Watch from 1.05 – The fanbase for a player who has just played 14 International games. pic.twitter.com/mCFBgI7WnR
— Johns. (@CricCrazyJohns) June 28, 2022