నెదర్లాండ్స్ జట్టే కదా ఈజీగా గెలిచేయచ్చు అనుకున్న పాకిస్తాన్‌కి నెదర్లాండ్స్ టీమ్ చుక్కలు చూపించింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ అద్భుతమైన ఓపెనర్స్‌తో అత్యధిక పరుగులు సాధించినప్పటికీ నెదర్లాండ్స్‌ని ఓడించడానికి తల ప్రాణం తోకకొచ్చినంత పనయ్యింది. రీషెడ్యూల్ ఒడీ సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో పర్యటిస్తోంది. రోటర్‌డామ్ వేదికగా మంగళవారం పాక్-నెదర్లాండ్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ 109 బంతుల్లో 109 పరుగులు పాకిస్తాన్ టీమ్‌కి శుభారంభాన్నిచ్చారు. ఇమామ్ ఉల్ హక్ 2 పరుగులు, కెప్టెన్ బాబర్ ఆజం 74, మహమ్మద్ రిజ్వాన్ 14, ఖుష్‌దిల్ షా 21 పరుగులు సాధించగా.. షాదబ్ ఖాన్, అఘా సల్మాన్‌లు ఆఖరి వరకూ ఉండి 75 పరుగుల పార్టనర్ షిప్ సాధించారు. దీంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 314 పరుగుల భారీ లక్ష్యాన్ని నెదర్లాండ్స్ ముందు ఉంచింది. అయినప్పటికీ నెదర్లాండ్స్ టీమ్‌తో తలపడి గెలవడానికి పాకిస్తాన్ చాలా కష్టపడాల్సి వచ్చింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్ టీమ్ ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ 65 పరుగులతో రాణించి ధైర్యాన్ని నింపారు. మరో ఓపెనర్ మాక్స్ ఒడౌడ్ 1, వెస్లీ బరెస్సి 2, బాస్ డీ లీడే 16 పరుగులతో నిరుత్సాహపరిచారు. అయితే ఆ తర్వాత దిగిన టామ్ కూపర్ 54 బంతుల్లో 65, స్కాట్ ఎడ్వర్డ్స్ 60 బంతుల్లో 71 పరుగులు చేసి పాకిస్తాన్‌కి చుక్కలు చూపించారు. ఆఖరి వరకూ స్కాట్ ఎడ్వర్డ్స్ నాటౌట్‌గా నిలిచి టీమ్‌ను లక్ష్య సాధన వైపు పరుగులు పెట్టించారు. తేజ నిడమనూరు 15, లోగాన్ వాన్ బీక్ 28, టిమ్ ప్రింగ్లే 0, ఆర్యన్ దత్ 6(నాటౌట్) పరుగులతో సరిపెట్టుకోవడంతో నెదర్లాండ్స్ టీమ్ 50 ఓవర్లలో 298 పరుగులు మాత్రమే సాధించి పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. అయినప్పటికీ పాకిస్తాన్‌కి గట్టి పోటీనైతే ఇచ్చింది.
మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మీడియాతో మాట్లాడారు. ఎట్టకేలకు తనకు ఉపశమనం లభించిందని, ఫఖర్ అద్భుతమైన సెంచరీ చేశాడని, అయితే తాము మరింత మెరుగ్గా రాణించాల్సిందని అన్నారు. ఇక్కడి పిచ్ పరిస్థితులు తమకు గట్టి సవాలుని విసిరాయని, అతి కష్టం మీద ఓటమి నుంచి తప్పించుకున్నామని అన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
🗣️ Fakhar Zaman shares how he and Babar Azam planned for their superb 168-run partnership as he reviews the first ODI against the Netherlands 🏏#NEDvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/3L4eptqgQw
— Pakistan Cricket (@TheRealPCB) August 17, 2022