తన హయంలో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్. దిగ్గజ బ్యాటర్లను సైతం తన పేస్ బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టేవాడు. అలాంటి దిగ్గజ ఆటగాడు ఇద్దరు టీమిండియా యువ బౌలర్లను మెచ్చుకున్నాడు. వారిని చూస్తే ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు. శుక్రవారం ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్ సమావేశంలో మాట్లాడుతూ.. టీమిండియా యువ బౌలర్లు ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్‌ఖాన్‌ను చూస్తుంటే తనకెంతో గర్వంగా ఉందని పేర్కొన్నాడు.
తమ ఫౌండేషన్ నుంచి చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌తో పాటు టీమిండియా తరపున ఆడటం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. కాగా.. ప్రసిధ్ కృష్ణ ఎంఆర్‌ఎఫ్ ఫౌండేషన్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. మెక్‌గ్రాత్ ఈ ఫౌండేషన్‌కు 2012 నుంచి డైరెక్టర్‌గా ఉన్నాడు. ఎంఆర్‌ఎఫ్ కంపెనీ ద్వారా 1987లో ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌ను చెన్నైలో స్థాపించారు. ఇక్కడ పేస్ బౌలర్లకు శిక్షణ ఇస్తారు. ఈ ఫౌండేషన్‌కు తొలుత ఆసీస్ మాజీ పేస్ బౌలర్ హెడ్ డెన్నిస్ లిల్లీ డైరెక్టర్‌గా ఉన్నారు. 2012 నుంచి మెక్‌గ్రాత్‌కు ఆ బాధ్యతలు తీసుకున్నారు. కాగా ఈ ఫౌండేషన్‌లో బాధ్యతలు తీసుకుని పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా మెక్‌గ్రాత్.. ఫౌండేషన్, టీమిండియా బౌలర్ల గురించి మాట్లాడారు.
కాగా.. టీమిండియా మాజీ క్రికెటర్లు జహీర్‌ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, మున్నాఫ్ పటేల్, వెంకటేశ్ ప్రసాద్, ఆర్పీ సింగ్, శ్రీశాంత్, జే.శ్రీనాథ్, వివేక్ రాజ్దాన్ కూడా ఈ ఫౌండేషన్‌లో శిక్షణ తీసుకున్నవారే. అలాగే టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బౌలర్ అయ్యేందుకు ఈ ఫౌండేషన్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. అలాగే చవిందావాస్, హెన్రీ ఒలొంగా, మొహమ్మద్ ఆసీఫ్, గ్లెన్ మెక్‌గ్రాస్, మిచ్చెల్ జాన్సన్, బ్రెట్‌లీ లాంటి విదేశీ క్రికెటర్లు సైతం ఈ ఫౌండేషన్‌లో శిక్షణ తీసుకున్న వారే. మరి ఈ ఫౌండేషన్‌పై, ఇండియన్ క్రికెటర్లపై మెక్‌గ్రాత్ ప్రశంసలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Glenn McGrath gives his verdict on Rohit Sharma’s recent form, names two young India pacers he is ‘proud of’ https://t.co/pLy8gAMn2Q
— Hindustan Times (@HindustanTimes) August 6, 2022
ఇది కూడా చదవండి: వెస్టిండీస్ టూర్ అని అమెరికాలో మ్యాచ్ ఆడుతున్న టీమిండియా!