భారత్‌తో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు కంగారుల జట్టు ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టింది. ఈ నెల 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరగనుంది. మొత్తం నాలుగు టెస్టుల సిరీస్ తర్వాత.. మూడు వన్డే సిరీస్ ఆడనుంది ఆస్ట్రేలియా. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ భారత్‌లోనే జరగనుండటంతో ఈ వన్డే సిరీస్‌ను సైతం ఆస్ట్రేలియా చాలా సీరియస్‌గానే తీసుకుంది. అయితే.. ఈ కీలక సిరీస్‌కు ఆ జట్టు స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ దూరం అయినట్లు సమాచారం. గతేడాది నవంబర్‌లో స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మ్యాక్స్‌వెల్.. దురదృష్టవశాత్తు గాయపడ్డాడు. అతని కాలికి గాయం అయింది. ఆ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని మ్యాక్సీ.. టీమిండియా టూర్‌కు సైతం దూరం కానున్నాడు.
ఈ విషయంపై ఆసీస్ కోచ్ హస్సీ సైతం స్పందిస్తూ.. మ్యాక్స్‌వెల్ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. కానీ.. మ్యాక్స్ వన్డే సిరీస్‌కు దూరం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలాగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి దూరం కావడం తనను జీవితాంతం బాధపెడుతుందని మ్యాక్స్‌వెల్ సైతం పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున ఆడే మ్యాక్స్‌వెల్‌కు భారత పిచ్‌లపై పూర్తి అవగాహన ఉంది. వన్డే వరల్డ్ కప్‌కు ముందు మూడు వన్డేల సిరీస్‌కు దూరం అయినంత మాత్రమే.. ఆస్ట్రేలియా జట్టుపై పెద్దగా ప్రభావం పడదని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. కాగా.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కంటే ముందు.. భారత్‌కు టెస్టు సిరీస్ కీలకంగా మారనుంది.
నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ కనీసం 3-1తో గెలిస్తే.. ఈ ఏడాది జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో మళ్లీ ఆస్ట్రేలియాతో తలపడే అవకాశం ఉంది. 2021లో న్యూజిలాండ్‌తో తొలి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడిన భారత్.. ఓడిపోయింది. మరో సారి భారత్‌కు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిచే అవకాశం కొన్ని అడుగుల దూరంలోనే ఉంది. అందుకే.. ఆసీస్‌తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని రోహిత్‌సేన చాలా సీరియస్‌గా తీసుకుంది. అలాగే 2004 నుంచి ఆస్ట్రేలియా ఇండియాలో ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. ఆ రికార్డును టీమిండియా కొనసాగిస్తుందా? లేక ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్ చేస్తుందా? చూడాలి. అలాగే వన్డే సిరీస్‌కు మ్యాక్స్‌వెల్ దూరం అవ్వనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🗣️ Missing out of Border-Gavaskar Trophy will bag me for the rest of my life – Glenn Maxwell #BGT #GlennMaxwell pic.twitter.com/PYupusVqNb
— CricFit (@CricFit) January 29, 2023