చీకటి మయమైన ఢాకాలోని మీర్పూర్ స్టేడియం. కాసేపు ఆగిపోయిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఆఖరి లీగ్ మ్యాచ్.సెల్ ఫోన్లతో వెలుగులు నింపిన అభిమానులు.
బంగ్లా వేదికగా జరుగుతోన్న ‘బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్’ లో ఒక ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా ఫ్లడ్ లైట్స్ ఆగిపోయాయి. దీంతో స్టేడియం మొత్తం చీకటి మయం అయిపోయింది. అయితే, అభిమానుల సెల్ ఫోన్లతో ఆ ప్రాంతానికి వెలుగులు నింపారు. ఈ కారణంగా కాసేపు మ్యాచ్ ఆగిపోయింది. శుక్రవారం రాత్రి ఫార్చ్యూన్ బరిషల్, ఖుల్నా టైగర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అందుకు సంబధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
ఢాకా వేదికగా ఫార్చ్యూన్ బరిషల్, ఖుల్నా టైగర్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్.. లీగ్ మ్యాచుల్లో చివరిది కావడంతో అభిమానులు భారీగా పోటెత్తారు. మ్యాచ్ సైతం రసవత్తరంగా ఆరంభమైంది. అయితే.. ఆ ఆనందం అభిమానులకు ఎక్కువ సేపు నిలవలేదు. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్ లోనే ఫ్లడ్ లైట్స్ ఆగిపోయాయి. బంగ్లాదేశ్ లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు ఉండటం, స్టేడియంకు ఆటోమేటిక్ పవర్ సిస్టం అందుబాటులో లేకపోవడంతో ఫ్లడ్ లైట్స్ అన్ని ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొంది. ఐపీఎల్ తో పోటీ పడి టోర్నీ నిర్వహిస్తానున్నాం అని చెప్పుకునే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్విరామంగా పవర్ అందించలేకపోతోందా..? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Reflection to Bangladesh’s current power crisis?
During a BPL match this evening, Mirpur stadium in Dhaka goes dark. Power resumed in the pressbox after a minute, but flood light remained off for minutes. pic.twitter.com/zqUgQA9USe
— Saif Hasnat (@saifhasnat) February 10, 2023