క్రికెట్ ప్రపంచంలో దిగ్గజాలు మృతి అనేది కొనసాగుతూనే ఉంది. తాజాగా కారు ప్రమాదంలో సౌత్ ఆఫ్రికాకు చెందిన మాజీ అంపైర్ రూడీ ఎరిక్ కోఎర్ట్ జెన్(73) కారు ప్రమాదంలో మృతి చెందినట్లు కుమారుడు రూడీ కోఎర్ట్‌జన్ జూనియర్ అల్గోవా ఎఫ్‌ఎంకు తెలియజేశాడు. ఎప్పటిలాగానే రూడీ తన మిత్రుడితో కలిసి గోల్ఫ్ ఆడేందుకు కేప్ టౌన్‌కు వెళ్లినట్లు తెలియజేశాడు. వాళ్లు సోమవారమే తిరిగి రావాల్సింది. కానీ, వాళ్లు ఇంకో రౌండ్ ఆడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిజేశాడు.
సౌత్ ఆఫ్రికా రైల్వేస్ లో క్లర్క్ గా పనిచేసే రోజుల్లో రూడీ లీగ్ క్రికెట్ ఆడేవాడు. 1981లో రూడీ అంపైర్ అయ్యాడు. 11 ఏళ్ల తర్వాత ఇండియా- సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌తో రూడీ అంపైర్ గా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత తన కెరీర్‌లో 108 టెస్టులు, 209 వన్డేలు, 14 టీ20 మ్యాచ్‌లకు రూడీ ఎరిక్ కోఎర్ట్ జెన్ అంపైర్ గా వ్యవహరించాడు. 2010లో అపైరింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు.
South Africa will be wearing black armbands, in honour of the umpire Rudi Koertzen, who apparently has died, which is sad news
— Will Macpherson (@willis_macp) August 9, 2022
Rudi Koertzen is no more. He has died in a car crash. He was 73. A well loved and respected umpire across the world.
His last test match was in 2010, Aus v Pak at Headingley. He was given a guard of honour and signed jersey.
Rest in peace Sir. #RudyKoertzen pic.twitter.com/aBS9SRugxY
— Cricketologist (@AMP86793444) August 9, 2022