ఇంగ్లాండ్ జట్టు 7 టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం పాకిస్థాన్ లో అడుగుపెట్టింది. పాక్ లో అడుగుపెట్టినప్పటి నుంచి బ్రిటీష్ జట్టుకు అడుగడుగునా భద్రతను ఏర్పాటు చేసింది పాక్. తాజాగా జరిగిన చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ 67 పరుగుల తేడాతో పాక్ ను ఓడించి.. సిరీస్ ను 4-3 తో కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతంర ఇంగ్లాండ్ కెప్టెన్ మెుయిన్ అలీ పాకిస్థాన్ భద్రత గురించి, అక్కడి ఆహారం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్ లో అన్నీ బాగున్నాయి కానీ ఫుడ్ ఒక్కటే బాలేదు. ఆహారం విషయంలో నేను అసంతృప్తికి గురయ్యాను అని వెల్లడించాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
క్రికెట్ టోర్నీలలో భాగంగా పలు దేశాలు.. వివిధ దేశాల్లో పర్యటించాల్సి ఉంటుంది. దాంతోవారికి భద్రత, ఆహారం విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాల్లో చిన్న పొరపాట్లు జరిగినా.. ఆ దేశ క్రికెట్ బోర్డ్ కే కాదు.. ఆ దేశానికి కూడా చెడ్డపేరు వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా పాక్ లో టీ20 సిరీస్ కోసం ఇంగ్లాండ్.. పాక్ గడ్డపై అడుగు పెట్టింది. ఉగ్రవాదులకు పురిటిగడ్డ అయిన పాక్ లో క్రికెట్ ఆడటానికి దాదాపు ఏ దేశాలు సహసం చేయవు. కానీ ఎన్నో కట్టుదిట్టమైన భద్రతల నడుమ బ్రిటీష్ జట్టు పాక్ లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే చివరి మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ మెుయిన్ అలీ పాక్ లోని భద్రత గురించి, ఆహారం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. “పాక్ లో అడుగుపెట్టే ముందు మాకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. కానీ ఇక్కడి వచ్చాక మా సందేహాలు అన్ని తప్పని తేలాయి. ముఖ్యంగా భద్రత విషయంలో పాకిస్థాన్ చాలా కట్టు దిట్టంగా వ్యవహరించింది. 2005 తర్వాత మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే ఇక్కడికి వచ్చాం. అంతా బాగానే ఉంది గానీ నాకు తిండి విషయంలోనే కొద్దిగా అసంతృప్తి మిగిలింది. కరాచిలో మేం 4 మ్యాచ్ లు ఆడాం.. అక్కడి ఫుడ్ నాకు చాలా బాగా నచ్చింది. మిగతా మూడు మ్యాచ్ లో లాహోర్ లో ఆడితే అక్కడ ఆహారం మాత్రం నాకు నచ్చలేదు. అంతా బానే ఉంది అదొక్కటే నా అసంతృప్తికి కారణం” అంటూ తన మనసులోని మాటను వెల్లడించాడు. మెుయిన్ అలీ మాటలు విన్న నెటిజన్స్ పలు రకాలుగా మండిపడుతున్నారు.”మీరు ఆట ఆడటానికి వెళ్తున్నారా? తినడానికి, తిరగడానికి వెళ్తున్నారా?” మెుయిన్ అలీ జీ మీరు తిండి మీద పెట్టే శ్రద్ద కాస్తా.. ఆట మీద పెట్టండి” అంటూ చురకలు వేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మెుదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. డేవిడ్ మలన్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్ లతో 78 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మిగతావారిలో బ్రూక్ 46 రన్స్ తో నాటౌట్ గా నిలువగా, డకెట్ 30 పరుగులు చేశాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పొయి 142 పరుగులకే పరిమితం అయ్యింది. దాంతో 67 రన్స్ తేడాతో పాక్ ఓటమి పాలైంది. పాక్ టీమ్ లో షాన్ మసూద్ 56 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీయగా, డేవిడ్ వల్లీ 2 వికెట్లతో సత్తాచాటాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డేవిడ్ మలను అందుకోగా.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును హ్యారీ బ్రూక్ అందుకున్నాడు.
Dawid Malan wins the player of the match award for his brilliant innings of 78*(47).#CricTracker #PAKvsENG #BabarAzam #MoeenAli #Cricket #DawidMalan pic.twitter.com/MtJFJhKF2s
— CricTracker (@Cricketracker) October 2, 2022