“రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు” టోర్నీలు మారుతున్నాగానీ టీమిండియా తలరాత మాత్రం మారడంలేదు. వరుస పరాజయాలు పలకరిస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల ముందు ఆసియా కప్ లో.. ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్ లో.. ఎందుకు ఇలా జరుగుతోంది? జట్టులో ఆటగాళ్లు లేరా? ఎందుకు లేరు అందరు వరల్డ్ క్లాస్ ప్లేయర్లే. మరెందుకు ఓడిపోతున్నారు అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. అందుకే అంటారు “అన్నీ ఉన్నాగాని ఆవగింజంత అదృష్టం ఉండాలని” మరి టీమిండియాకు అంత మాత్రం అదృష్టం లేదంటారా? ఇక ఇవ్వన్నీ పక్కన పెడితే ఇటీవల వరుస పరాజయాలతో.. టీమిండియాకు, కెప్టెన్ రోహిత్ శర్మకు క్రికెట్ ఫ్యాన్స్ థ్యాక్స్ చెబుతున్నారు. అదేంటి ఓడిపోతే థాక్స్ ఎందుకు చెప్తారు? అనుకుంటున్నారా? ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆసియా కప్ 2022లో భారత్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. అప్పటికి ఆసియా కప్ బరిలో ఉన్న ఇతర జట్ల కంటే టీమిండియానే బలంగా ఉంది. దాంతో సాధారణంగానే అభిమానుల్లో బజ్ పెరిగిపోయింది. ఈ సారి కప్ కొట్టేది మనమే అని అభిమానులు అంతా తెగ సంబరపడిపోయారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. సూపర్-4 దశలోనే భారత్ వెనుదిరిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు నిరాశకు గురైయ్యారు. ఎవరైనా.. ఎవరిమీదైనా.. ఆశలు పెట్టుకుంటే! ఆ ఆశలు నెరవేరకపోతే? ఎంతటి నిరాశకు గురౌతారో మనందరికి తెలిసిందే. సర్లే ఆసియా కప్ ఎలాగో పోయింది. కనీసం ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ నైనా భారత్ గెలుస్తుంది కదా! అనుకున్నారు అభిమానులు. కానీ తొలి మ్యాచ్ లోనే మాపై ఆశలు పెట్టుకోవద్దు అని రోహిత్ శర్మ ఓటమి ద్వారా చెప్పకనే చెప్పాడు. ఆసిస్ తో జరిగిన తొలి టీ20లో 208 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ బౌలర్ల, ఫీల్డర్ల వైఫల్యంతో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
దాంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ మీకో దండంరా బాబు.. మీపై నమ్మకం పెట్టుకోవడం మా తప్పే.. అంటూ నెట్టింట తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అభిమానులు థ్యాక్స్ చెబుతున్నారు. దానికి ఓ కారణం ఉంది.. టీ20 వరల్డ్ కప్ భారత్ సాధిస్తుందని ఇప్పటి వరకు మేం నమ్మకం పెట్టుకున్నాం. ప్రస్తుతం మీ ఫర్పార్మెన్స్ చూస్తే టీ20 వరల్డ్ కప్ రావడం సాధ్యం కాదని మాకు అర్ధం అయ్యింది. ఈ విషయాన్ని మాకు ముందే తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు అంటూ.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. వస్తుందని ఆశలు పెట్టుకోవడం కంటే రాదని ముందే తెలిస్తే దానిని మనం అంత సిరీయస్ గా తీసుకోం కదా! అంటున్నారు నెటిజన్స్. ఏది ఏమైనప్పటికీ టీమిండియా మళ్లీ పుంజుకుని తిరిగి మునుపటి ఫామ్ ని కొనసాగించాలని కోరుకుందాం. మరి రోహిత్ శర్మకు అభిమానులు థ్యాక్స్ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Things went right down to the wire but it’s Australia who won the first #INDvAUS T20I.#TeamIndia will look to bounce back in the second T20I.
Scorecard 👉 https://t.co/ZYG17eC71l pic.twitter.com/PvxtKxhpav
— BCCI (@BCCI) September 20, 2022