సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ 2022 ఐపీఎల్ సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన విషయం తెలిసిందే. ధోని సారథ్యంలోని సీఎస్‌కేలో డుప్లెసిస్ కీలక సభ్యుడిగా చాలా ఏళ్లపాటు కొనసాగాడు. కానీ.. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు సీఎస్‌కే డుప్టెసిస్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో డుప్లెసిస్‌ను మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు రూ.7 కోట్లకు కొనుగులు చేసింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలను కూడా డుప్లెసిస్‌కు అప్పగించింది ఆర్సీబీ.
అయితే డుప్లెసిస్ మళ్లీ తిరిగి సీఎస్‌కే కాంపౌండ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. కానీ అది ఐపీఎల్ కోసం కాదులేండి. త్వరలో ప్రారంభం కానున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డుప్లెసిస్ సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాట్లు సమాచారం. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆరుకు ఆరు ఫ్రాంచైజ్‌లను ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లైన ముంబై, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, రాజస్థాన్, లక్నో దక్కించుకున్న విషయం తెలిసిందే. ముంబై ఇప్పటికే తమ టీమ్ పేరు ఎంఐ కేప్‌టౌన్‌గా ప్రకటించింది. ఆ జట్టులో ఆడే ముఖ్యమైన ఆటగాళ్లను సైతం పరిచయం చేసింది.
అలాగే జోహన్నెస్‌బర్గ్ ఫ్రాంచైజ్‌ను సొంతం చేసుకున్న సీఎస్‌కే మేనేజ్‌మెంట్ తమ టీమ్‌లోకి డుప్లెసిస్‌ను తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతనికే అప్పగించనున్నట్లు తెలుస్తుంది. 2011 నుంచి 2021 వరకు పదేళ్ల పాటు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన డుప్లెసిస్ మళ్లీ ఆ టీమ్ మేనేజ్‌మెంట్‌తో జతకట్టినట్లు అయింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The bond between Faf du Plessis and Super Kings remains strong. 💪 pic.twitter.com/5jWZiqEJgB
— 100MB (@100MasterBlastr) August 11, 2022
Faf Du Plessis is the only player to scored a Century in Test, ODI and T20I at same venue : Johannesburg.#WhistlePodu #Yellove #CSK 💛🦁 pic.twitter.com/irczAhjMuf
— Johannesburg Super Kings (@JoziSuperKings) August 11, 2022