టీమిండియా వెటరన్ క్రికెటర్, ఆర్‌సీబీ నయా హిట్టర్.. దినేశ్ కార్తీక్ ఐపీఎల్ 2022 సీజన్ లో అద్భుత ఆటతీరు కనబరిచాడనే చెప్పాలి. తన ధనా ధన్ ఇన్నింగ్స్ లతో మ్యాచ్ ఫలితాలనే మార్చేశాడు. కెరీర్ చివరి దశలో దినేశ్ కార్తీక్ 2.oను తలపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన కార్తీక్.. సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ ఎంపికయ్యాడు. ఈ క్రమంలో దినేష్ కార్తీక్ కెరీర్ ముగిసిందంటూ మూడేళ్ల కిందట ఒక స్పోర్ట్స్ ఛానల్ ప్రకటించిన వార్తలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
డీకే చివరగా 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆడాడు. ఆ తర్వాత ఫామ్ లేమి కారణంగా అతను జట్టులో చోటు కోల్పోయాడు. అనంతరం.. కామెంటేటర్ గా మారాడు. ఆ దృశ్యాలను టెలికాస్ట్ చేసిన సదరు ఛానల్.. అప్పట్లోనే దినేష్ కార్తీక్ కెరీర్ ముగిసినట్లుగా ప్రచారం చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. “ఎవరిని.. ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదంటూ.. సదరు ఛానల్ పై నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక.. 36 ఏళ్ల లేటు వయసులో కార్తీక్ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడంపై అతని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభకు వయసుతో సంబంధం లేదని డీకే నిరూపించాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Ravi Shastri: కొంచెం మైండ్ పెట్టి కెప్టెన్లను ఎంపిక చేయండి! రవిశాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ క్రమంలో దినేశ్ కార్తీక్.. తన పునరాగమనంపై ఆసక్తికర ట్వీట్ చేశాడు. మనపై మనకు విశ్వాసం ఉన్నప్పుడే ప్రతిదీ మనమనుకున్నట్లుగా జరుగుతుంది.. కష్టకాలంలో మద్ధతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు, నాపై నమ్మకముంచి మరో అవకాశం ఇచ్చిన సెలెక్టర్లకు కృతజ్ఞతలు.. హార్డ్ వర్క్ కంటిన్యూ చేస్తానంటూ డీకే తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న డీకే బెస్ట్ ఫినిషర్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 14 మ్యాచులాడిన డీకే.. 57.40 సగటున 287 పరుగులు చేశాడు.
If you believe yourself, everything will fall into place! ✨
Thank you for all the support and belief…the hard work continues… pic.twitter.com/YlnaH9YHW1— DK (@DineshKarthik) May 22, 2022
Matches – 14
Runs – 287
Average – 57.40
SR – 191.33
Sixes – 21Dinesh Karthik 🤝 destruction 🔥#DineshKarthik #RCB #IPL2022 #Cricket #RCBvsLSG pic.twitter.com/qpm09MX5eF
— Wisden India (@WisdenIndia) May 24, 2022
