బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. దీంతో చాలా మంది క్రికెటర్లు దెబ్బకు మిలియనిర్లు అయిపోయారు. శనివారం మొదలైన వేలంలో అన్ని ఫ్రాంచైజ్‌లు ఆటగాళ్ల కోసం పోటీ పడ్డాయి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఒక విచిత్రంగా అనేక మంది ప్లేయర్ల కోసం వేలంలో పోటీ పడి.. ఆ ఆటగాళ్ల ధరను పెంచేసింది. ఇలా అనేక సార్లు.. క్రికెటర్ల కోసం పోటీలో ఉండడం చివరికి వేరే ప్రాంచైజ్‌కు అంటగటడం చేసింది.
సాధారణంగా చీటి పాటలలో లాగా వేరే వాళ్లు పాటను కావాలని, అవసరం లేకున్నా పెంచుకుంటూ పోయినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ సహ ఓనర్ కిరణ్ కుమార్ గ్రాంధీ వేలంలో ఆటగాళ్ల ధరను కావాలనే పెంచినట్లు సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఆటగాళ్ల కోసం పోటీ పడి.. ధరను భారీగా పెంచి వాళ్లను వేరే ఫ్రాంచైజ్‌లు సొంతం చేసుకుంటే నవ్వుకుంటూ ఎంజాయ్ చేశారు డీసీ మేనేజ్‌మెంట్. ఆక‌్షన్‌ను ఆసాంతం చూసిన వారు ఢిల్లీ అనుసరించిన వ్యూహాన్ని పసిగట్టారు. కావాలనే తక్కువ ధరకు పోయే ఆటగాళ్లను కూడా ఎక్కువ ధరకు వేరే ఫ్రాంచైజ్‌లకు అంటగట్టారు ఢిల్లీ ఓనర్ కిరణ్ కుమార్. ఆయన అలా చేయడానికి వెనుక పెద్ద మాస్టర్ స్ట్రాటజీ ఉన్నట్లు సమాచారం.ఆటగాళ్ల ధరను పెంచడం ద్వారా ఇతర ఫ్రాంచైజ్‌ల వద్ద ఉన్న డబ్బును తగ్గిస్తూ.. తమ వద్ద ఎక్కువ మొత్తంలో మిగిలించుకుని.. మంచి ఆటగాళ్లు వచ్చిన సమయంలో దాన్ని వాడేలా.. ఆయన ప్లాన్ చేసినట్లు అర్థం అవుతోంది. అందుకే ఢిల్లీ వేలంలోనే బెస్ట్ ఆక‌్షనిస్ట్‌గా పేరు తెచ్చుకుంది. వారి టీమ్‌ను చూస్తే ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. తమకు అవసరం లేని ఆటగాళ్ల కోసం కూడా ఢిల్లీ వేలంలో పాల్గొని వేరే ఫ్రాంచైజ్‌లను దెబ్బతీసింది. ప్రస్తుతం ఢిల్లీ ఓనర్ కిరణ్ కుమార్ గ్రాంధీ టాక్ ఆఫ్‌ది సోషల్ మీడియాగా మారారు. వేలంలో ఆయన అనుసరించిన విధానంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఆయన స్ట్రాటజీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.