ప్రతిష్టాత్మక ట్రోఫీ అయిన రంజీలో జాతీయ జట్టుకు ఆడిన ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో ఆడిన సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడాతో పాటు ఇటివల బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ సైతం రంజీ బరిలోకి దిగారు. జార్ఖండ్ తరఫున ఆడుతున్న ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ ముంబైకి ఆడుతూ.. హైదరాబాద్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో 80 బంతుల్లో 90 రన్స్ బాది.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరితో పాటు మరో టీమిండియా ఆటగాడు దీపక్ హుడా సైతం.. రాజస్థాన్ జట్టుకు ఆడుతూ.. సెంచరీతో కదం తొక్కాడు.
కేరళతో మంగళవారం ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ కెప్టెన్ సంజు శాంసన్ రాజస్థాన్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు కేరళ బౌలర్ ఫాజిల్ ఆరంభంలోనే షాకిచ్చాడు. రాజస్థాన్ ఓపెనర్ అభిజిత్ తోమర్‌ను కేవలం 10 పరుగులకే అవుట్ చేసి దెబ్బ తీశాడు. ఆ తర్వాత.. వన్ డౌన్‌లో వచ్చిన మహిపాల్ లోమ్రోర్(23)తో కలిసి ఓపెనర్ యష్ కొథారి(58) హాఫ్ సెంచరీ పార్ట్నర్‌షిప్‌ను నెలకొల్పాడు. రాజస్థాన్ 86 పరుగుల వద్ద మహిపాల్ వికెట్ కోల్పోవడంతో.. దీపక్ హుడా బ్యాటింగ్‌కు వచ్చాడు. కేరళ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న దీపక్ హుడా సెంచరీతో దుమ్మురేపాడు. 187 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్‌తో 133 పరుగులు చేసిన హుడా జాలాజీ సక్సెనా బౌలింగ్‌లో ఫాజిల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి.. రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. సల్మాన్ ఖాన్ 62, మానవ్ 6 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
ఇక టీమిండియా తరఫున 2022 ఫిబ్రవరీలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన హుడా ఇదే ఏడాది ఫిబ్రవరీలోనే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో టీ20ల్లోకి సైతం అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 10 వన్డేలు ఆడిన హుడా 153 రన్స్ చేశాడు. అలాగే 15 టీ20ల్లో 302 పరుగులు సాధించాడు. దీపక్ హుడాకు టీ20ల్లో ఒక సెంచరీ కూడా ఉంది. ఇక ఐపీఎల్‌ల్లో గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన హుడా మంచి ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్ 2023 సీజన్ కోసం దీపక్‌ను లక్నో రిటేన్ కూడా చేసుకుంది. అయితే రంజీల్లోనూ మంచి ప్రదర్శన కనబర్చి.. మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని హుడా పట్టుదలగా ఉన్నాడు. మరి దీపక్ హుడా రంజీలో కేరళపై సెంచరీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Deepak Hooda hits a century in his first FC match in two years for Rajasthan against Kerala. He lifts the team from 105/4 towards 250 with his crucial stand with Salman Khan. #RanjiTrophy
— Lalith Kalidas (@lal__kal) December 20, 2022